మరో యంగ్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్.. క్రేజీ న్యూస్!
టాలీవుడ్ సీనియర్ హీరోల ఆలోచన సరళి మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్తదనంతో ఆడియన్స్ ని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు మల్టీస్టారర్ కథలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం నానితో దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ గురించి క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది.

యంగ్ హీరోతో
నాగార్జున మరో యంగ్ హీరోతో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్, నాగార్జున కలసి నటించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు టాక్.

భారీ నిర్మాణ సంస్థ
ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ యువ దర్శకుడుతో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రాధమికంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్
నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో మల్టీస్టారర్ చిత్రంలో నటించడం శర్వానంద్ కు ఇదే తొలిసారి కానుంది. త్వరలోనే దర్శకుడు నాగార్జున, శర్వానంద్ కు కథ వినిపించబోతున్నాడట. హీరోలనుంచి గ్రీన్ సింగ్నల్ వస్తే సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు.

దేవదాస్
నాగార్జున, నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











