సమస్యల్లో నాగార్జున, రాఘవేంద్రరావు షిర్డీ సాయి ప్రాజెక్టు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున త్వరలో షిర్డీ సాయిబాబాగా కనిపించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు సమస్యల్లో పడిందని చెప్తున్నారు. షిర్డీ సాయి భక్తులు కొందరు నాగార్జున ఆ పాత్రలో కనపడటం ఇష్టం లేదని తెలిపినట్లు వినపడుతోంది. ఎంతో పవిత్రంగా బ్రతికిన ఆ యోగి పాత్ర చేయటానికి నాగార్జునకి ఏం అర్హత ఉందని రాఘవేంద్రరావుని కలిసి అడిగినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అంతేగాక అన్నమయ్య, శ్రీరామదాసు అయితే వాళ్ళు దైవ భక్తులు అని వారి పాత్రలు చేయటానికి సమస్య లేదని, దేముడుగా కనిపంచాలంటే కొంత నిష్ట ఉన్నవారు అవసరమని వారు చెప్పిట్లు తెలుస్తోంది. అయితే అన్నమయ్య చేసే సమయంలోనూ ఇలాంటి సమస్యలు వచ్చాయని రాఘవేంద్రరావు లైట్ గా తీసుకున్నారని అంటున్నారు. ఇక ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు. కొత్త రచయిత ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. జె.కె.భారవి ప్రస్తుతం ఆదిశంకరాచార్య అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











