నాగార్జున 100వ సినిమా.. ఇలాంటి పని చేశాడేంటీ?

అక్కినేని నాగార్జున టాలీవుడ్ సీనియర్ హీరోగా ఇప్పటికీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలకు దీటుగా స్టైలిష్ లుక్ లో మెరుస్తూ వెండి తెరపై ఆకట్టుకుంటున్నారు. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు షాక్ ఇచ్చేలా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు అక్కినేని నాగార్జున తన కెరీర్లో 99 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక నెక్స్ట్ తన 100వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ సినిమా గురించి తాజాగా క్రేజీ అప్డేట్ అందింది.

అక్కినేని నాగార్జున ఉత్తమ చిత్రాలు...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా అక్కినేని నాగార్జున హిందీ తమిళ చిత్రాలోనూ నటించారు. ఇక తెలుగు చిత్రాలు 1986 నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తున్నారు. నాగార్జున కెరియర్ లో హీరో గానే కాకుండా విభిన్న పాత్రల్లోనూ నటించి మెప్పించారు. గ్రీకు వీరుడుగా, మన్మధుడిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. భక్తి చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1989లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన శివ చిత్రంతో ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యారు. అంతకు ముందే గీతాంజలి, ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, అన్నమయ్య, సీతారామరాజు, నువ్వు వస్తావని, స్నేహమంటే ఇదేరా, సంతోషం, శివమణి, నేనున్నాను, సూపర్, శ్రీరామదాసు, కింగ్, వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

Nagarjuna special Care about his 100th film

నాగార్జున 100వ చిత్రం..
అక్కినేని నాగార్జున చివరిగా బంగార్రాజు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మస్ర పార్ట్ 1, ది గోస్ట్, నా సామి రంగ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఏడాదిగా అక్కినేని నాగార్జున నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇప్పటివరకు నాగర్జున 99 చిత్రాల్లో నటించారు. కాగా ఆయన 100వ చిత్రం గురించి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున తన 100వ చిత్రం పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఒక తమిళ దర్శకుడిని ఎంపిక చేసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

నాగార్జున ఇలాంటి పని చేశారా?
కింగ్, నాగార్జున తన కెరీర్లో 100వ చిత్రాన్ని దర్శకత్వం చేసే అవకాశాన్ని తమిళ దర్శకుడికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏ హీరో కైనా తన భాషలో 100 వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఆ భాష దర్శకులకి అందిస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం తమిళ దర్శకుడు కార్తీక్ కు అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఇటీవల నాగార్జున ఎక్కువగా కోలీవుడ్ చిత్రాలలో నటిస్తుండడంతో అక్కడి దర్శకుల కథలను విన్నారని ప్రచారం జరుగుతుంది.

నాగార్జున రాబోయే చిత్రాలు..
ఆరు పదుల వయసులోనూ అక్కినేని నాగార్జున యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. నీ వయసులోనూ రొమాంటిక్, యాక్షన్ సీన్లతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నుంచి డైరెక్ట్ ఫిలిం ఏది లేదు. కానీ నాగార్జున కీలక పాత్రలు పోషించిన కోలీవుడ్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి, ధనుష్ కుబేరా చిత్రాలతో అలరించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X