తనయుడి కెరీర్ పై నాగార్జున సీరియస్.. సొంత నిర్ణయాలకు చెక్.. లాక్‌డౌన్ లోనే స్పెషల్ ప్లాన్!

అక్కినేని హీరోల అదృష్టం ఏమిటో గాని ఎంత కష్టపడి పని చేసినా కొన్నిసార్లు ఉహీంచని అపజయాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. నాగార్జున సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన కెరీర్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకున్నాడు. ఇక నాగ చైతన్య కూడా అదే తరహాలో సెట్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు అఖిల్ మాత్రం ఇంతవరకు ఒక్క సక్సెల్ కూడా అందుకోలేదు.

అఖిల్ సొంత నిర్ణయాల వల్ల..

అఖిల్ సొంత నిర్ణయాల వల్ల..

కష్టపడే గుణం చాలానే ఉంది. కానీ అఖిల్ కొన్ని సొంత నిర్ణయాల వలన ఇప్పటివరకు సక్సెస్ అందుకోలేదని తెలుస్తోంది. మొదటి సినిమానే నాగార్జున ప్రమేయం లేకుండా తెరకెక్కింది. ఆ తరువాత హలో సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక మిస్టర్ మజ్ను సినిమా అఖిల్ సొంత నిర్ణయంతోనే సెలెక్ట్ చేసుకున్నప్పటికి మళ్ళీ దెబ్బ పడింది.

అఖిల్ నెక్స్ట్ సినిమా..

అఖిల్ నెక్స్ట్ సినిమా..

నిజానికి నాగార్జున ఇంతవరకు అఖిల్ విషయంలో అనుకున్నంతగా కేర్ తీసుకోలేదట. ఇక ఈ లాక్ డౌన్ లో పూర్తిగా నాగార్జున తనయుడి కోసమే సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అఖిల్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సమ్మర్ లో రావాల్సిన ఆ సినిమా అనుకోని విధంగా వాయిదా పడింది.

హోమ్ బ్యానర్ లోనే..

హోమ్ బ్యానర్ లోనే..

అల్లు అరవింద్ మీద నమ్మకంతో అఖిల్ కి ఆ సినిమా సెట్ చేసిన నాగార్జున నెక్స్ట్ మూడు కథలు మాత్రం తాను చెప్పినవే చేయాలని అఖిల్ కి గట్టిగా చెప్పేశాడట. అంటే కెరీర్ కొంచెం సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే వరకు సొంత నిర్ణయాలకు పోవద్దని నెక్స్ట్ సినిమాను హోమ్ బ్యానర్ లో భారీ బడ్జెట్ లో ప్లాన్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారట.

Recommended Video

Tollywood Stars Chiranjeevi & Others Met AP CM YS Jagan Over TFI Isuues
అఖిల్ కోసం నాలుగు కథలు..

అఖిల్ కోసం నాలుగు కథలు..

లాక్ డౌన్ మొదలనప్పటి నుంచి నాగార్జున అఖిల్ కోసం చాలా కథలు విన్నాడట. ఆల్ మోస్ట్ నాలుగు కథలు కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. రగడ దర్శకుడు వీరుపోట్లతో కూడా ఒక మంచి కథను సెట్ చేయించినట్లు సమాచారం. ఎలాగైనా అఖిల్ కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని చాలా సీరియస్ గా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ నెక్స్ట్ సినిమాలతో ఎలాంటి విజయాల్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X