twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మని వద్దని వేడుకున్న నాగార్జున

    By Srikanya
    |

    నాగచైతన్య తాజా చిత్రం దడ డిజాస్టర్ ఎఫెక్టు నాగార్జున పై పడింది.ఆయన వెంటనే నాగచైతన్య తదుపరి రిలీజయ్యే బెజవాడ రౌడీలు చిత్రంపై కాన్సర్టేట్ చేయాలని డిసైడ్ అయ్యారు.చిత్ర దర్సకుడు వివేక్ ని పిలిచి స్పెషల్ క్లాసు పీకినట్లు సమాచారం. కొత్త దర్సకులు అంటేనే ఆయన భయపడిపోతున్నారు. నాగచైతన్యతో చేసిన జోష్ కి వాసు వర్మ కొత్త దర్శకుడు అది ప్లాప్. అలాగే దడ చిత్రం అజయ్ భుయాన్ కొత్త దర్శకుడు.. అదీ ప్లాప్. ఇక బెజవాడ రౌడీలు.. దర్శకుడు వివేక్ కృష్ణ కొత్త దర్సకుడు.దాంతో ఇప్పుడు నాగార్జున వివేక్ పై దృష్టి పెట్టారు. స్టైలిష్ టేకింగ్ పేరుతో సి్నిమాని నాశనం చేయవద్దని కంటెంట్ మీద దృష్టి పెట్టమని, సినిమా రిలీజై నాగచైతన్యకు నాలుగు సినిమాలు వచ్చేలా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

    అలాగే కాంట్రావర్శిలు కూడా ఎక్కువ చేసి సినిమాకు అనవరసమైన హైప్ క్రియేట్ చేసి ఆ తర్వాత తీరిద్దా విచేరించే స్కీమ్ లు మానుకోమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే తనదేమీ లేదని తన బాస్ వర్మ ఎలా చెప్తే అలా తాను ఫాలో అవటమేనని వివేక్ చెప్పటంతో వర్మను కలిసి తన కుమారుడు భవిష్యత్ ని ఇబ్బందుల్లో పాడేయవద్దని వేడుకున్నట్లు తెలుస్తోంది. వర్మ ఏమీ భయపడాల్సిన పనిలేదని మంచి సబ్జెక్టు, గ్యారెంటీగా హిట్ అవుతుందని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.ఎంత మాట ఇచ్చినా వర్మ చేయాలనుకున్నది చేసేస్తాడని ఫిల్మ్ సర్కిల్సో అనుకుంటున్నారు. మొత్తానికి ఓపినింగ్స్ గట్టిగా రాబట్టే ఈ సినిమా విజయవంతమైతే నాగచైతన్యకు యాక్షన్ హీరో ఇమేజ్ వస్తుంది.

    English summary
    Naga Chaitanya's upcoming flick 'Bezawada Rowdeelu'. Produced under the banner of Ram Gopal Varma the film has created enough controversy till date to garner huge openings. However Nagarjuna has lost beliefs in upcoming and fresh directors in delivering a hit with Chaitu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X