Don't Miss!
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
నాగార్డున కొత్త చిత్రం టైటిల్ 'ఢమురుకం' గా ఫిక్స్
నాగార్జున,శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న చిత్రానికి "ఢమురుకం"అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర నిర్మాతలైన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసారు. ఇక ఈ చిత్రం గురించి శ్రీనివాస రెడ్డి ..నాగార్జునగారితో సినిమా నిర్మించాలనేది నా చిరకాల కోరిక. ఆ కోరిక ఈ ఏడాదే నెరవేరుతుండటం చాలా ఆనందంగా ఉంది. ముందెన్నడూ చేయని అద్భుతమైన పాత్రను ఇందులో నాగార్జున చేస్తున్నారు. నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన్ను ఎలాంటి సినిమా చేయాలని ఆభిమానులు ఆశిస్తున్నారో..ఆ స్థాయిలో కథను రెడీ చేశారు అంటున్నారు. ఇక ఈ చిత్రం అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ అని సమాచారం. అనుష్క హీరోయిన్ గా చేసే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రస్తుతం నాగార్జున..బిందాస్ దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో రగడ చిత్రం పూర్తయింది. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో గగనం కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు.