Naa Saami Ranga: నాగార్జున సినిమాలో అసలైన ట్విస్ట్ లీక్.. అల్లరి నరేష్ దెబ్బకు మైండ్ బ్లాక్ ఖాయం

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వేగంగా సినిమాలు చేసే హీరోలు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన చాలా స్లోగానే సినిమాలు చేస్తున్నారు. దీనికితోడు గతంలో మాదిరిగా భారీ హిట్లను కూడా అందుకోవడం లేదు. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలన్న లక్ష్యంతో 'నా సామిరంగ' చేస్తున్నారు.

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా సినిమానే 'నా సామిరంగ'. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా తీస్తున్నారు.

 Nagarjuna Starrer Naa Saami Ranga Movie Main Twist Revealed

ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తోన్న 'నా సామిరంగ' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని ఏమాత్రం బ్రేకులు లేకుండా జరుపుతూ టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం జరుపుతూ ఫైనల్ కాపీని రెడీ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కూడా జరుపుకుంది.

అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని రూపొందిస్తోన్న 'నా సామిరంగ' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. దీన్ని జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం మొదలు పెట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అయింది.

 Nagarjuna Starrer Naa Saami Ranga Movie Main Twist Revealed

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'నా సామిరంగ' మూవీలో అల్లరి నరేష్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున పక్కనే ఉండే అంజి అనే కుర్రాడిగా అతడు కనిపించబోతున్నాడు. అయితే, ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ హైలైట్‌గా ఉండబోతుందట. అదేంటి అనేది సినిమాలో చూసిన వాళ్ల మైండ్ బ్లాక్ అయిపోతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో నరేష్ పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X