నా సామిరంగ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ సెంటిమెంట్ ప్రకారం నాగార్జునకు హిట్టే

తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకటి. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు.

చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే 'నా సామిరంగ'. ఫేమస్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Release On January 14th

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'నా సామిరంగ' మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుస షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలాగైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. కానీ, రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు.

అక్కినేని నాగార్జున - విజయ్ బిన్ని కలయికలో రూపొందుతోన్న 'నా సామిరంగ' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని యూనిట్ మొదటి నుంచీ చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ షోలో హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతికి వస్తుందని చెప్పాడు. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

Nagarjuna Starrer Naa Saami Ranga Movie Release On January 14th

తాజా సమాచారం ప్రకారం.. 'నా సామిరంగ' మూవీని జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో 'బంగార్రాజు' జనవరి 14న వచ్చి హిట్ అయింది. అలాగే, 'సోగ్గాడే చిన్ని నాయన' జనవరి 15వ వచ్చి సక్సెస్ అయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే నాగార్జున అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X