»   » ఇప్పటికీ నాగార్జునకి టచ్ లో ఉంది కాబట్టే ఆమెకి...

ఇప్పటికీ నాగార్జునకి టచ్ లో ఉంది కాబట్టే ఆమెకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉదయ్ కిరణ్ సరసన నువ్వు నేను చిత్రంలో కనపించి మురిపించిన అనిత ఆ తర్వాత తరుణ్..నిన్నే ఇష్టపడ్డాను లో కనిపించింది. ఆ మధ్య నాగార్జున బాస్ చిత్రంలో ఓ ఐటం సాంగ్ లో మెరిసింది. అప్పుడు పరిచయమైన నాగార్జునని మాత్రం ఆమె వదలకుండా కంటిన్యూ అవటం వల్లనే ఆమెకు రగడలో చిన్న వేషం దొరికిందని వినపడుతోంది. రగడలో ఆమె బ్యాంక్ ఎంప్లాయి గా ఆమె చిన్న పాత్ర చేసింది. నాగార్జున, అనూష్క, బ్రహ్మానందం కాంబినేషన్ లో సీన్ అది. నాగార్జున ఆమె అందాన్ని పొడిగి ఆమె చేత తనకు కావాల్సిన పని చేయించుకుంటాడు. ఈ పాత్రకు మొదట వేరే ఫేడవుట్ హీరోయిన్ ని అనుకున్నారు కానీ నాగార్జున పట్టుబట్టి మరీ అనితను పిలిపించి ఆమెకు ఈ ఆఫర్ ఇప్పించాడని తెలుస్తోంది. ఇక అనిత ప్రస్తుతం నటాషా పేరుతో ఏక్తా కపూర్ వారి బాలాజీ టెలీఫిలిమ్స్ టీవీ సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu