‘షిరిడి సాయి’ మూవీలో ప్రేయసి టబుతో నాగార్జున...!
నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో 'శిరిడి సాయి' కథ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాల్లో నాగార్జున భక్తుడి పాత్రలు పోషించగా, ఇప్పుడీ చిత్రంలో ఏకంగా భగవంతుడి పాత్రనే పోషిస్తున్నారు. కాగా, గతంలో 'అన్నమయ్య' సినిమాలో నాగ్ సరసన రమ్యక్రిష్ణ, కస్తూరి కథానాయికలుగా నటించగా, 'శ్రీరామదాసు' సినిమాలో స్నేహ హీరోయిన్ గా నటించింది. అయితే 'శిరిడి సాయి' బ్రహ్మచారి కావడంతో నాగ్ సరసన కథానాయిక నటించే అవకాశం లేదు.
కానీ, గతంలో నిన్నేపెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే నాగార్జున సరసన నటించిన తన స్నేహితురాలు ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో ప్రముఖనటి టబు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర ఏమిటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. అయితే ఈ సినిమాకి టబుని సెలక్ట్ చేయడం వెనుక సీక్రెట్ ఏంటంటే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు మన ఎక్కుగా ఆంధ్రప్రదేశే కే పరిమితమైనవి. ఎక్కువ హిందువులు అందులో అన్నమయ్య, శ్రీరామదాసు బాగా తెలసినటువంటి వారు ఉన్నారు కాబట్టి.. ఇక శిరిడి సాయిబాబా ఇటు ఆంద్రప్రదేశ్ లోనే కాకుండా ఓవరాల్ ఇండియాలో బాబా గురించి తెలియనివారుండురు సో సౌత్ ఇండస్ట్రీలో టుబుకి మంచి స్థానం ఉంది కాబట్టి ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేసి తెలుగులోనే కాకుండా హింది, తమిళ్ ఇతర భాషల్లో రూపొందించటానికి ప్రయత్నిస్తున్నారు...


Click it and Unblock the Notifications











