నాగార్జున హార్ట్ టచింగ్ డెశిషన్
హైదరాబాద్: నాగార్జున తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్ణయం భావోద్వేగంతో తీసుకున్న హార్ట్ టచింగ్ డెశిషన్ అంటున్నారు. నాగార్జున తాజా చిత్రం 'మనం' ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేస్తారని,ప్యాన్స్ అంతా వెళ్లవచ్చని భావించారు. అయితే ఇప్పుడు ఆడియో పంక్షన్ చేయటం లేదని వినికిడి. ఆడియోని డైరక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు మరణించిన ఇంకా సంవత్సరం కూడా గడవకముందే ఇలాంటి పంక్షన్ జరుపుకోవటం పద్దతి కాదని, తాను స్టేజిపై ఎమోషన్ అయ్యే అవకాసం ఉందని భావించిన నాగార్జున ఫంక్షన్ ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆడియో ఫంక్షన్ లు సినిమాలు ప్రీ రిలీజ్ హైప్ తీసుకొస్తాయనే విషయం తెలిసిందే. అయినా సరే ఫంక్షన్ ని వద్దనుకుంటున్నారని చెప్తున్నారు.
నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారు నటించిన చివరి చిత్రం కాబట్టిసినిమా మీద అంచనాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మంచి సినిమాఅవుతుంది అనిపిస్తోంది.ఇది పూర్తి కుటుంబ సభ్యులతో చూడతగ్గ చిత్రం లా ఉంటుందని చాలా మందిఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. నాన్న,నేను, చైతన్య కలిసి నటించిన ఈ సినిమానుఅన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో ఓ ప్రెస్టీజియస్ సినిమా గా దర్శకులు విక్రమ్ కుమార్ రూపొందించారుసినిమా ఆడియోను ఈ నెలలో నే విడుదల చేసి సినిమానుమే నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము'' అన్నారు

అలాగే ...కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం అంటున్నారు నాగార్జున. '' 'ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమాలా ఉంది' అంటున్నారంతా. నిజంగానే ఇది అలాంటి సినిమానే. మనందరి ప్రేమకథని 'మనం'లో చూడొచ్చు. మా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. త్వరలో పాటల్ని వినిపిస్తాము''అన్నారు.
అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











