అంటే నాగార్జున హ్యాండ్ ఇచ్చినట్లేనా?
హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఆయన తదుపరి చిత్రం నాగార్జున తో చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. నాగార్జున మరో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిత్రం కమిటయినట్లు చెప్పుకుంటున్నారు.
అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సోగ్గాడు అనే టైటిల్ ని సైతం ఖరారు చేసినట్లు వినపడుతోంది. ఈ మేరకు సోగ్గాడు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినం చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం జరుగుతుంది. రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున తన కుమారుడు నాగా చైతన్య తాజా చిత్రం రిలీజ్ ని పర్యవేక్షిస్తున్నారు.

'ఒక లైలా కోసం' గురించి నాగ్ మాట్లాడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.


Click it and Unblock the Notifications











