Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
నాగార్జున బిగ్ బడ్జెట్ మూవీకి సమస్యలు.. ఆ ఒక్క కారణంతో సినిమానే ఆపేశారు?
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక సినిమాను స్టార్ట్ చేస్తే వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని చూస్తారు. టైమ్ వేస్ట్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఎక్కువశాతం కొత్త దర్శకులతో వర్క్ చేయడానికి ఇష్టపడే నాగ్ టాలెంట్ ఉంటే ఎవ్వరికైనా సరే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. నిర్మాత దొరక్కపోతే చాలాసార్లు తన సొంత ప్రొడక్షన్ లోనే ప్రొడ్యూస్ చేసిన సందర్బాలు ఉన్నాయి.
అంతగా దర్శకులకు సపోర్ట్ చేసే నాగార్జున ఇటీవల ఒక దర్శకుడి సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. మళ్ళీ మొదలు పెడతారో లేదో తెలియదనే కామెంట్స్ వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు ప్రవీణ్ సత్తారు. గరుడవేగ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రవీణ్ తో బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కరోనా కారణంగా సినిమా షూటింగ్ మొన్నటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చారు.
ఇక ఈ లాక్ డౌన్ అనంతరం స్టార్ట్ చేయాలని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ సడన్ గా బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఈ సినిమాను ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశం లేదట. స్క్రిప్ట్ విషయంలోనే డైరెక్టర్ హీరోల మధ్యలో భిన్నాభిప్రాయాలు వెలువడడంతో సినిమాను హోల్డ్ పెట్టారని సమాచారం. ఇక నాగార్జున పూర్తిగా బంగార్రాజు సినిపైనే ఫోకస్ పెట్టబోతున్నాడని సమాచారం.
ఆ సినిమా తరువాత మరొక సినిమాపై దృష్టి పెడతారట. ఇక ప్రవీణ్ సత్తారు కూడా మరొక హీరో కోసం వెతుకుతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.