‘సాక్షి’ తప్పుడు వార్తలపై ఆగ్రహం చెందిన నాగార్జున...!?
తమిళ మీడియాలో నాగచైతన్య, అనుష్క కు వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసిన నాగార్జున పెద్దంత సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. కారణం ఆయనకి గాసిప్స్ అంటే చాలా ఇష్టమని పలు సందర్బాల్లో అన్నారు కూడా..కానీ ఈ వార్తలను నిన్న సాక్షి పేపర్ లో పబ్లిష్ చేసింది. ఇది నాగ్ ని చాలా అప్ సెట్ చేసిందని తెలుస్తోంది. సాక్షి అధినేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జగన్ కి నాగార్జున ఫుల్ సపోర్ట్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొడుకు విషయం..అది కూడా కరెక్ట్ కానీ ఓ విషయాన్ని పేపర్ లో పబ్లిష్ చేయడం పట్ల నాగ్ చాలా అప్ సెట్ అయ్యాడని వినికిడి. ఇలా తప్పుడు వార్తలు రాసినందుకు డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడాలని కూడా నాగ్ భావిస్తున్నట్టు సమాచారం.
కాగా ఇదే విషయంలో అనుష్క కూడా కండిస్తూ, తను ఈ రోజు బెంగళూరు లోని నర్తకీ థియేటర్ లో 'మత్తేబన్నీ ప్రీతిసోనా" అనే చిత్రాన్ని చూడటానికి తన కుటుంబ సభ్యులతో వచ్చిన అనుష్కను మీడియా చుట్టుమట్టి, నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ విషయం ప్రశ్నించగా ఆ వార్తలలో నిజంలేదని అది వట్టి పుకారని తేల్చి చెప్పింది. అంతే కాకుండా కన్నడంలో నటించుటకు తను సిద్దంగా ఉన్నానని దానికి తగ్గ స్క్రిప్ట్ తో ఏ దర్శకనిర్మాతలు తన దగ్గరుకు వచ్చినా నటిస్తానని చెప్పింది....


Click it and Unblock the Notifications











