నాగార్జున మనస్సులో పడ్డ ఆ కొత్త హీరోయిన్
నాగార్జున దృష్టి తాజాగా ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయం అవుతున్న కొత్త హీరోయిన్ తాప్సీ పై పడినట్లు సమాచారం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్టిల్స్ విడుదల కాగానే అందరి దృష్టి ఆమెపై మళ్ళింది. దానికి తోడు మొన్న ఆడియో పంక్షన్ లో ఆమె స్టేజీపైనే శృంగారం ఒలకపోస్తూ ఈ సారి రాఘవేంద్రరావు గారు ఏ పళ్ళు విసిరారో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే అంటూ ముద్దు ముద్దుగా గారాలు ఒలికింది. దాంతో హార్ట్ బీట్ పెరిగిన ప్రభాస్ తన చిత్రంలో కాజల్ ని కాదని ఆమెకు చోటిచ్చేసాడు. ఇప్పుడు నేను మాత్రం తక్కువా అని నాగార్జున కూడా ఆమె మేనేజరుతో మాట్లాడుతున్నాడు. వీరూపోట్ల దర్శకత్వంలో నాగార్జున చేసే చిత్రంలో ఆమెను తీసుకుందామని నిర్ణయించుకున్నాడని సమాచారం. కొత్త నేది ఎక్కడున్నా ఎంకరేజ్ చేయటంలో నాగార్జున ముందుంటాడనే సంగతి తెలిసిందే. మొన్నటి దాకా అదే కోవలో అనూష్క, మమతా మోహన్ దాస్ ని పూర్తి స్ధాయిలో నాగార్జున ఎంకరేజ్ చేసారు.


Click it and Unblock the Notifications











