»   » ఇక చాలు ఆపు.... సమంతకి నాగార్జున వార్నింగ్!?

ఇక చాలు ఆపు.... సమంతకి నాగార్జున వార్నింగ్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల ప్రేమ వ్యవహారం గురించి కొన్ని రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నా.. వీరిద్దరూ మౌనంగానే ఉంటున్నారు. వీరికి సంబందించిన ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారట. అయితే వీళ్ళ పెళ్లి సెప్టెంబర్ లో ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే.. అసలు చైతన్య, సమంతలు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అనేది క్లారిటీ లేదు. దీనిపై వీరిద్దరి మధ్య మొదటి సినిమా 'ఏమాయ చేశావే' సినిమా నుంచే మొదలు అయిందని అంటున్నారు. వాస్తవానికి ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. మంచి జోడి అని కూడా అప్పట్లో అన్నారు కూడా. సమంత ఇప్పుడు సినిమాల కన్నా, ఆమె లవ్ మ్యాటర్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం సమంత కెరీర్‌పై ప్రభావం చూపిస్తున్నట్టే ఉంది. నాగచైతన్య కూడా ఎక్కడా ప్రేమ విషయంలో బయటపడటం లేదు. కానీ ఆయన తండ్రి నాగార్జున మాత్రం 'నాగచైతన్య తనకి నచ్చిన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకొన్నాడు. ఆ విషయంలో ఒక తండ్రిగా నేను ఆనందంగా ఉన్నా' అని చెప్పారు. అప్పట్నుంచి నాగచైతన్య, సమంతల ప్రేమ వార్తలకి మరింత బలం చేకూరినట్టైంది. అన్నీ కుదిరితే వీరిద్దరి పెళ్లి డిసెంబరులోనే జరగొచ్చని సమాచారం.

పెళ్లి

పెళ్లి

అయితే, ఈ విషయం బయటకు పొక్కడానికి, పెళ్లి ఫైనల్ కావడానికి ప్రధాన కారణం సమంతనే అని చెప్పుకోవాలి. దాదాపు రెండు, మూడు నెలలుగా మీడియా ముందు, సోషల్ మీడియాలో సమంత తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ, తన ప్రియుడు ఎవరో కాదని, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి అంటూ హింట్‌లు ఇవ్వడంతో ఈ హంగామా చివరకు పెళ్లి వరకు వచ్చింది.

నాగచైతన్య

నాగచైతన్య

అయితే, ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారంపై నాగచైతన్య తండ్రి హీరో నాగార్జున అంతగా ఆసక్తి కనబరచలేదని, ఎట్టకేలకు ఒప్పుకోక ఆయనకు తప్పలేదని ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటికీ కూడా సమంత సోషల్ మీడియాలో తన హంగామాకు ఫుల్‌స్టాప్ పెట్టకుండా పెళ్లి ఏర్పాట్లు గురించి మాట్లాడుతూనే ఉంది.

వ్యవహారం

వ్యవహారం

ఈ వ్యవహారం తో కాస్త చిరాకు పడ్డాడట నాగార్జున. అసలు మొదటినుంచీ ఈ పెళ్ళి ఇష్టం లేని నాగార్జున ఈ విషయం అంతటా తెలిసిపోవతం తో ఇక ఒప్పుకోక తప్పలేదు.

నాగచైతన్య

నాగచైతన్య

‘నాగచైతన్య తనకి నచ్చిన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకొన్నాడు. ఆ విషయంలో ఒక తండ్రిగా నేను ఆనందంగా ఉన్నా' అంటూ ఒక మాత చెప్పు ఊరుకున్నాడు.

పెళ్ళి ట్వీట్

పెళ్ళి ట్వీట్

అయితే ఈ మాట మీద సమంతకి నమ్మకం కుదరలేదేమో గానీ మరోసారి "పెళ్ళి ట్వీట్ లు మొదలుపెట్టటం తో నాగార్జునకి కోపం వచ్చిందట.

మొదటి సారిగా

మొదటి సారిగా

మొదటి సారిగా ఈ విషయంలో సమంతకు కాస్త గట్టిగానే సలహా ఇచ్చినట్లు తెలిసింది. ‘పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడకు. పెళ్లి ఏర్పాట్ల గురించి ట్వీట్లు కూడా పెట్టకు. ఇప్పటికే విషయం అంతా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు కూడా ఇటువంటి వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్‌తో మాట్లాడాలా? దయచేసి ఈ హంగామా ఆపేయ్' అంటూ నాగ్ సలహా ఇచ్చినట్లు ఒక వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

English summary
Nagarjuna's strong warning to Samantha about her tweets on marriage
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu