నిర్మాతని నాగార్జున హెచ్చరించాడా?
నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్ అనీ, లెక్కల్లో మొహమాటానకి తావు ఇవ్వరని అంటారు. రీసెంట్ గా నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో ఢమురకం చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం బడ్జెట్ నలభై కోట్లు. అయితే అంత తనపై పెట్టుబడి పెట్టడం నాగార్జున ఇష్టపడటం లేదు.దాంతో నిర్మాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వెంకట్ ని కలిసి బడ్జెట్ విషయమై సీరియస్ గానే హెచ్చరించాడని సమాచారం. తన బిజినెస్ ఎంతో తనకు తెలసని,మరీ అంత ఎక్కువ పెడితే రిటన్ రాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసాడట. కానీ వెంకట్ దానికి ఒప్చుకోలేదట. నాగార్జునతో భారీ బడ్జెట్ తీయాలనేది తన చిరకాల కోరిక అని, కాబట్టి బడ్జెట్ విషయం వదిలేయమని చెప్పాడని తెలుస్తోంది. ఇక ఢమురకం చిత్రం సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. కామిడీ చిత్రాల శ్రీనివాస రెడ్డి దీన్ని చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం శివుడు భూమి మీదకు రావటం అనే కాన్సెప్ట్ ను అనుసరించి కథ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











