కింగ్ 100 కోసం నాగార్జున మాస్టర్ ప్లాన్.. ఫ్యాన్స్‌ కోసం కెరీర్‌లోనే అతిపెద్ద రిస్క్..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కింగ్ 100. దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ పరిశ్రమలోనే కాకుండా అక్కినేనీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున.. తన వందో చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా నిలిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ క్రమంలో నాగార్జున ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ? ఆ కీలక మార్పులేంటీ?

నాగార్జున తన 100వ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తాత్కాలికంగా "కింగ్ 100" లేదా "లాటరీ కింగ్" అనే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నాగార్జున కెరీర్‌లో మైలురాయి చిత్రంగా వస్తుండటంతో టైటిల్ ఎంపిక విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.

Nagarjuna s Landmark 100th Film Targets Dussehra Release With AI-Powered New Look

ఇక కథానాయికల విషయానికి వస్తే.. ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నాగార్జున-టబు కాంబినేషన్‌కు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. వీరిద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. మరో హీరోయిన్‌గా సుస్మిత భట్ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ మేళవించి ఈ కథను రూపొందిస్తున్నారట.

ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన ఒక మనిషి ఎలా శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు అనే నేపథ్యంతో కథ సాగుతుందని సమాచారం. ఇందులో రెండు విభిన్న కాలాల కథాంశాలు ఉంటాయని, యువకుడి నుంచి వయసు మీద పడిన వ్యక్తి వరకు నాగార్జున పలు గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. నాగ్ తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని తరహా పాత్రలో కనిపించబోతున్నారని టాక్.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నారట. గతంలో కనిపించిన నాగార్జున యువకుడి లుక్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రెట్రో లుక్స్, యంగ్ ఏజ్ గెటప్స్‌ను సహజంగా చూపించేందుకు ప్రత్యేకంగా విజువల్ టెక్నాలజీపై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నాగ్ అభిమానులకు ఒక కొత్త అనుభూతిని అందించనున్నది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విడుదల ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పోటీకి బదులుగా 2026 దసరా సీజన్‌ను లక్ష్యంగా పెట్టుకుని మూవీ టీం ముందుకు సాగుతోందని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ పరిణామాలను చూస్తే.. నాగార్జున కాస్త రిస్క్ తీసుకుంటారేమోనని భావన ఫిల్మీ వర్గాల్లో ఉంది. కానీ, ప్రతి విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. గత కొన్నేళ్లుగా నాగార్జున ఆశించిన స్థాయి సొలో బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో నాగార్జున మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారో లేదో చూడాలి.

Read more about: tabu akkineni nagarjuna tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X