పుకార్లు: అఖిల్ సినిమాకు ఎంపీ కవిత పెట్టుబడి?
హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించిన విషయాల్లో వినిపించే పుకార్లు మరెక్కడా వినిపించవేమో. అయితే కొన్ని సార్లు పుకార్లే నిజం కావచ్చు....మరికొన్ని సార్లు నిజం కాక పోవచ్చు. తాజాగా ఫిల్మ్ నగర్లో అక్కినేని అఖిల్ తెరంగ్రేటం చేయబోయే సినిమా గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అఖిల్ తెరంగ్రేటం చేయబోయే సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్, సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ మొదలు కానుంది. నితిన్ కుటుంబంతో ఎంపీ కవితకు సత్సంబంధాలు ఉండటంతో తెర వెనక ఈ చిత్రం కోసం ఎంపీ కవిత పెట్టుబడులు పెడుతోందని కొందరు ఫిల్మ్ నగర్లో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది. గతంలో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణకు సంబంధించిన గొడవ కూడా నాగార్జున వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి సెటిల్మెంట్ చేసుకున్నాడని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 9 నుండి పాత బస్తీలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది.
షూటింగ్ త్వరత గతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











