Akkineni Akhil - Zainab Ravdjee: అఖిల్ అక్కినేని మ్యారేజ్ డేట్ ఫిక్స్? పెళ్లి ఎక్కడంటే?

Akkineni Akhil - Zainab Ravdjee : అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు హీరో అఖిల్ అక్కినేని (Akkineni Akhil) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత సంవత్సరం నవంబర్ 26న జైనబ్ రవ్జీతో అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇ‍చ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అఖిల్ పెళ్లి ఎక్కడ జరుగబోతుంది?వారి వివాహా వేడుక ఎక్కడ? అనే వివరాల్లోకెళ్తే..

అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగబోతుంది. గతేడాది డిసెంబర్ 4 న హీరో నాగచైతన్య (Naga Chaitanya) శోభితని(Sobhita) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో జరిగింది. వీరి మ్యారేజ్ అత్యంత సన్నిహిత బంధు మిత్రుల మధ్య జరిగింది. వీరి వివాహానికి ముందే నవంబర్ 26న అఖిల్ తన ప్రియురాలి జైనాబ్ రావ్‌జీతో సడెన్ గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ చేశారు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

Nagarjuna s Son Akhil Akkineni - Zainab Ravdjee s Wedding Plans Revealed Date Venue And More

అప్పటి నుంచి అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్జీల పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. పలు మీడియో నివేదికల ప్రకారం.. అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే వీరి పెళ్లికి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అఖిల్ అక్కినేని, జైనబ్ రవ్జీల పెళ్లి వేడుక కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య - శోభిత ల మారింది గానే.. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు సమాచారం. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అఖిల్ పెళ్లి కూడా అక్కడే జరగబోతున్నట్టు తెలుస్తుంది . అయితే..
మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Nagarjuna s Son Akhil Akkineni - Zainab Ravdjee s Wedding Plans Revealed Date Venue And More
ఒక వేళ వేరే దగ్గర పెళ్లి చేసుకుంటే.. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారట. అయితే.. అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీల పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదెలా ఉంటే.. ఇక అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రవ్జీ అఖిల్ కంటే 9 ఏళ్ళు పెద్ద అని సమాచారం. ఈ అమ్మడు థియేటర్ ఆర్టిస్ట్, పెయింట్ ఆర్టిస్ట్. అలాగే ఆమెకు బ్యూటీ కేర్ రిలెటేస్ట్ బిజినెస్ కూడా ఉన్నాయట. ప్రముఖ బిజినెస్ మెన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్.

వీరికి విదేశాల్లో కూడా పలు బిజినెస్ లు ఉన్నాయి. జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడు. నాగార్జునకు బిజినెస్ పరంగా సన్నిహితుడు కూడా. వీరిద్దరూ రానా పెళ్ళిలో కలుసుకున్నారనీ, ఈ సమయంలో ఏర్పడి స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. వారికి పెద్దల అంగీకారం లభించడంతో వారి ప్రేమబంధం పెళ్లిబంధంగా మారబోతుందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X