'ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది.. ప్లీజ్ న్యూస్ రాయండి' : ఏంది నాగశౌర్యనేనా ఇలా అంది!
యంగ్ హీరో, తెలుగు అమ్మాయిల రాకుమారుడు నాగ శౌర్య గురించి తెలిసిందే. అయితే ఈ టాలెంటెడ్ హీరో .. ఓ హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆమెతో అఫైర్ ఉన్నట్లు రాయమని బహిరంగంగా చెప్పారట. అదేంటి శౌర్య ఇలా అనడమేంటి అని అనుకుంటున్నారా దాని గురించే ఈ కథనం. అసలేం జరిగిందంటే..
టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. హ్యాండ్సమ్ లుక్స్, ఇనోసెంట్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు నాగశౌర్య. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఛలో సినిమానే ఆయన లాస్ట్ హిట్. దీంతో పంథాను మార్చి.. ఈ మధ్య విలక్షణమైన కథలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు.

రంగబలి నో వర్కౌట్: రీసెంట్ గా నాగ శౌర్య 'రంగబలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెద్దగా సందడి చేయలేకపోయింది. దీంతో నాగ శౌర్య ఖాతాలో మరో ప్లాప్ పడ్డట్లు అయ్యింది. ఇక దీంతో తన కొత్త సినిమాపై దృష్టి సారించారు శౌర్య. సూపర్ హిట్ సినిమా ధమాకా దర్శకుడి త్రినాథరావుతో ఓ చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపూరి నిర్మించనున్నారు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అయితే సింపుల్ గా చాలా డీసెంట్ గా కనిపించే నాగశౌర్య.. ఎప్పుడూ ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా కెరీర్ లో ముందుకెళ్తారన్న సంగతి తెలిసిందే. వీలైనంతవరకు యూత్ ఆడియన్స్ లేదా ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని చక్కని ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ తో ముందుకెళ్తుంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయన నటించే హీరోయిన్లతో ఎఫైర్ రూమర్స్ ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఓ సారి దీనిపై శౌర్య స్పందించారు కూడానట. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట.

ప్లీజ్ అనుష్కతో రాయండి: నాగశౌర్య మాట్లాడుతూ.. "నేను వర్క్ చేసన హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ రాస్తుంటారు. మాళవిక, రాశి ఖన్నాతో పాటు పలువురు హీరోయిన్లతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ న్యూస్. నేను ఏ హీరోయిన్ తోనూ డేటింగ్ చేయలేదు. నాకు హీరోయిన్ అనుష్క శెట్టి అంటేనే చాలా ఇష్టం. ఆమెతో లింక్ పెడుతూ ఎవరూ వార్తలు రాయలేదు. అనుష్క శెట్టితో ఎఫైర్ అని న్యూస్ రాయండి ప్లీజ్"... అని ఆయన అన్నట్లు బయట కథనాలు. మరి ఇందులో నిజమెంతో తెలీదు నాగశౌర్య ఈ కామెంట్స్ గతంలో అన్నట్లు ఈ వార్త బయట చక్కర్లు కొడుతోంది.

అనూష శెట్టితో పెళ్లి: ఇకపోతే నాగ శౌర్య గతేడాది అనూష శెట్టి అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో కేవలం సన్నిహితులు, బంధువుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ పెళ్లికి హాజరు కాలేదు. నాగశౌర్య భార్య బిజినెస్ ఉమెన్. సొంతంగా ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. వీరిద్దరి జోడీ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











