చంద్రముఖి ఎవరు, ప్రియమణి లేదా అనుష్కనా?
వెంకటేష్ హీరోగా నటిస్తున్న నాగవల్లి సినిమాలో చంద్రముఖి పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ప్రియమణి, అనుష్క నటిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు చంద్రముఖి పాత్ర పోషిస్తారనేది సీక్కెట్ గా ఉంచారు. అయితే, అనుష్క ఆ పాత్ర పోషిస్తుండవచ్చునని అనుకుంటున్నారు. ఈ ప్రశ్నకు హీరో వెంకటేష్ కూడా సమాధానం దాటవేశారు. రామానాయుడు స్టూడియోలో శనివారం సాయంత్రం జరిగిన నాగవల్లి సినిమా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినిమా పకడ్బందీ స్క్రప్ట్ తో తయారవుతోందని, చాలా ఇంటరెస్టింగా ఉంటుందని ఆయన చెప్పారు. సినిమా కథ రియాలా, కాదా అనేది తాను ఆలోచించడం లేదని చెప్పారు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా నాగవల్లి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రియమణి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. నాగవల్లి సినిమా డిసెంబర్ లో విడుదలవుతుందని నిర్మాత చెప్పారు.


Click it and Unblock the Notifications











