పవర్ స్టార్ తిక్క డైలాగుతో సినిమా...
ఈ మధ్య సినిమా డైలాగులను, పాటలను కూడా టైటిల్స్‌గా రిజిస్టర్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు కూడా ఇలాంటి టైటిళ్లతోనే సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు బిజినెస్ మేన్ చిత్రంలోని 'సార్ వస్తారా' పాట ఆధారంగా రవితేజ నటింబోయే చిత్రానికి 'సార్ వచ్చారు'గా నామకరణం చేశారు.
తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో ఇలాంటి మరికొన్ని ఆసక్తి కరమైన టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆ టైటిళ్ల వివరాలు...వాటిని రిజిస్టర్ చేయించిన సంస్థల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. నాక్కొంచెం తిక్కుంది...దానికి ఓ లెక్క ఉంది
రిజిస్టర్ చేయించిన వారు బోడపాటి విజువల్స్
2. బొమ్మాలి(నిన్ను వదల)
రిజిస్టర్ చేయించిన వారు ఎస్.కె. థియేటర్స్ ప్రై.లి.
3. నా గర్ల్ ఫ్రెండ్ నెం.9
రిజిస్టర్ చేయించిన వారు మంత్రా ఎంటర్‌టైన్మెంట్స్
4. రాబిన్ హుడ్
సంస్థ : లక్ష్మి నరసింహ ఎంటర్‌టైన్మెంట్స్
5. సంబరాల రాంబాబు
రిజిస్టర్ చేయించిన వారు సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి
6. తురుమ్
రిజిస్టర్ చేయించిన వారు సంగా ఆర్ట్స్ క్రియేషన్స్
7. 3జి లవ్(కట్టె...కొట్టె...తెచ్చె)
రిజిస్టర్ చేయించిన వారు బలరామ్ ఆర్ట్స్
8. మొగుడు ఊరెళితే(ఫుల్ హ్యాపీ)
రిజిస్టర్ చేయించిన వారు విరించి అకాడెమీ


Click it and Unblock the Notifications











