పాపం..‘ఎన్టీఆర్’అన్నా క్రేజ్ రావటం లేదు

By Srikanya

నందమూరి తారకరత్న రీసెంట్ గా తన పేరుని 'ఎన్టీఆర్"గా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే పేరు మార్చుకుని తన బాబాయ్ కోసం అనుకున్న టైటిల్ 'నందీశ్వరుడు"ని తీసుకుని,బాలకృష్ణ ని గెస్ట్ గా పెట్టుకున్నా కూడా సినిమా కు కొంచెం కూడా క్రేజ్ రాకపోవటం అతన్ని అయోమయంలో పడేస్తోంది అంటున్నారు.కన్నడంలో సూపర్ హిట్టయిన 'డెడ్లీ సోమా' అనే సినిమా ఆధారంతో ఆగస్ట్ 25నే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. అప్పుడు దర్శకుడు మాట్లాడుతూ... 'నందీశ్వరుడు' టైటిల్ ఇచ్చిన పెద్దలకు థాంక్స్. 'డెడ్లీ సోమా' అనే కన్నడ ఈసినిమాలో లైన్‌ను మాత్రం తీసుకున్నాం. తారకరత్న పాత్రతో పాటు షీనా పాత్ర కూడా హైలైట్‌గా ఉంటుంది అని చెప్పాడు. ఈ 'ఎన్టీఆర్" ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన షీనా కథానాయికగా నటిస్తున్నారు. అంజి శ్రీను దర్శకత్వంలో కోట గంగాధరరెడ్డి, శేగు రమేష్‌బాబు కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికి 40 శాతం టాకీ పూర్తి చేసుకుంది ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -''ఎలాంటి అవాంతరాలు లేకుండా, అందరి సహకారంతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

వచ్చే నెలాఖరుకు టాకీని పూర్తి చేసి, నవంబరులో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. సందర్భానుగుణంగా ఇందులో ఏడు పాటలుంటాయి. ఆ ఏడు పాటలను ఏడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. రచయితలు పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ -''కన్నడంలో సూపర్‌హిట్ అయిన 'డెడ్లీ సోమా" ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలకు రచన చేస్తున్నప్పుడు మేం ఎంత భావోద్వేగానికి లోనయ్యామో ఈ 'నందీశ్వరుడు"కి పనిచేసేటప్పుడు కూడా అలాంటి అనుభూతినే పొందాం. ఇందులో తారకరత్న నట విశ్వరూపం చూస్తారు""అని చెప్పారు. మంచి టీమ్‌తో పనిచేయడం తన అదృష్టమని, ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న సంగీత దర్శకుడు పార్థు గొప్ప సంగీత దర్శకుడిగా ఎదుగుతాడని దర్శకుడు అన్నారు. ఇలా ఇంత హైప్ క్రియేట్ చేసినా సినిమాకు కొంచెం కూడా క్రేజ్ రాకపోవటం తారకరత్న కి ఇబ్బందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X