బాలకృష్ణ భారీ నుండి మిస్ అయినందుకు చాలా హ్యాపీ..
'సింహా" విజయంలో భాగం పంచుకున్న భామలు నయనతార, నమితలకి మళ్లీ ఇంకో సినిమా ఇస్తానని బాలకృష్ణ మాటిచ్చాడట. అన్నమాట ప్రకారమే నయనతారని 'శ్రీరామరాజ్యం"లో సీతని చేశాడు. అలాగే నమితకి కూడా 'పరమవీర చక్ర" ఆఫర్ చేశాడు. నేహా ధూపియా క్యారెక్టర్ కి నమిత పేరుని బాలయ్య సిఫార్సు చేయగా, ఆ క్యారెక్టర్ ఫైట్లు చేయడంతో పాటు బికినీ కూడా ధరించాల్సి వస్తుందని, నమితని అందులో జనం చూడలేరని దాసరి అభ్యంతరం చెప్పాడట. అలా ఆ క్యారెక్టర్ ని నమిత మిస్ అయింది.
అయితే ఒక చారిత్రిక పరాజయం సాధించిన చిత్రంలో తన పాత్ర లేనందుకు నమిత ఇప్పుడు ఆనందిస్తోంది. అయితే నమిత ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతోంది. నేహా ధూపియాకి ఆ స్కిన్ షో వల్ల కాస్త పేరయినా దక్కింది. ఒకవేళ నమిత ఆ పాత్ర పోషించి ఉంటే రెండు వారాలాడిని పరమవీర చక్ర ఒక్కవారంలోనే బాక్సులు సర్థేసుకునేదేమో..
బాలకృష్ణ నమిత నయనతార శ్రీరామ రాజ్యం నేహా ధూపియా బాపు balakrishna namitha nayantara sri rama rajyam neha dhupia bapu


Click it and Unblock the Notifications