పూరీ చిత్రంలో నమిత ఐటం సాంగ్
పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా తీయ తలపెట్టిన గోలీమార్ చిత్రంలో సెక్సీ నమిత ఓ ఐటం సాంగ్ చేయనుందని సమాచారం. ఈ మేరకు ఆమె రెండు మార్లు పూరీతో మీటింగ్ అయినట్లు చెప్తున్నారు. పోకిరీలో ముమైత్ సాంగ్ మాదిరిగా ఈ పాటను కూడా హిట్ చేయాలనే తలంపుతోనే ఆమెను ఐటం సాంగ్ కు ఒప్పించాడని తెలుస్తోంది. ఇక నమిత అయితే పూరీ నెక్ట్స్ చిత్రంలో అయినా హీరోయిన్ ఛాన్స్ ఇవ్వమని అడిగి హామీ తీసుకుని మరీ ఈ సాంగ్ కి సైన్ చేసిందని చెప్తున్నారు. పూరీ వంటి స్టార్ డైరక్టర్ చేతిలో పడితే తన దశ తిరుగుతుందని ఆమె భావిస్తోంది. ఇక గోలీమార్ చిత్రంలో గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు. ఎనకౌంటర్ స్పెషలిస్టు గా పూర్తి స్ధాయి యాక్షన్ తో చిత్రం ఉంటుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. బొమ్మాళి రవి విలన్ గా చేస్తున్నాడు. దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే గోపీచంద్ సరసన కేక హీరోయిన్ ఇషానీ ని తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











