సౌత్ ఇండియాలో అందులోనూ తమిళనాడు వారికి హీరోయిన్ అంటే తెరనిండుగా భారీగా ఉంటేనే ఆదరిస్తారనేది మరోసారి రుజువు అయిందని తమిళ పత్రికలు రాస్తున్నాయి. హఠాత్తుగా ఈ టాపిక్ ఏమిటంటే అడ్డంగా పెరిగిన నమితను చూపెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఖుష్భూ భారీగా ఉండబట్టే ఆమెని పూర్తి స్ధాయిలో ఆరాధించి,గుడి కూడా కట్టారని ఇప్పుడు ఆ అవకాశం నమితకు దక్కిందంటున్నారు. అసలు ఓ ప్రక్క బాలీవుడ్ హీరోయిన్స్ అంతా సైజ్ జీరో కాన్సెప్ట్ అంటూ కష్టపడుతూంటే...భారీ అందాల నమిత మాత్రం వారికి విరుద్దంగా బిహేవ్ చేస్తోందని అంటున్నారు. ఇలా ఉండబట్టే ఆఫర్స్ వరసగా వస్తున్నాయంటూ రుజువులు చూపుతున్నారు. ఇంతకీ పెరిగిన ఈ అందాలు ఏ సైజుకి చేరుకున్నాయి అంటూ షాకయ్యే ఫిగర్ చెప్తున్నారు. వారు చెప్పే దాని ప్రకారం ఆమె కొలతలు 40-32-38. అవును అంత ఖచ్చితంగా నమిత కొలతలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే అదో దేవరహస్యం అంటున్నారు.