నమితా నీకొక నమస్కారం...

By Staff

Namitha
తెలుగులోకి వచ్చిన ప్రతీ సారీ భారీ అందాల నమితకు శృంగభంగమే ఎదురౌతోంది. వెంకటేష్ తో అప్పట్లో భైరవి పేరుతో 'జెమినీ' చేసినా వర్కవుట్ కాలేదు. తర్వాత ఆర్యన్ రాజేష్ తో 'సొంతం' అన్నా కలిసిరాలేదు. అవన్నీ కాదని పూర్తి స్థాయిలో ఎక్స్ ఫోజ్ చేస్తూ ...'పార్ధు'లో లారెన్స్ ప్రక్కన చేసినా ఫలించలేదు. అయినా తమిళంలో ఆపుఅంతూ లేకుండా ఆఫర్స్ వస్తున్నా అదేంటో గాని ఆమెకు తెలుగు వారిని అలరించాలనే ఆశయంట. దాంతో మళ్ళీ ఇప్పుడు శరత్ కుమార్ ప్రక్కన చేసిన 1977 అనే సినిమా తెలుగులో డబ్బింగ్ చేయటంతో తెగ ఆనందపడుతోందిట. అంతేగాక ఈ సినిమా హిట్టయితే తను చేసిన సినిమాలన్నీ డబ్బింగ్ చేస్తారు అప్పుడు అయితే తెలుగు నిర్మాతల కళ్ళ తనపై పడతాయని ఆశిస్తోందిట.

అయినా మన తెలుగులో ఆ మధ్య కొందరు నిర్మాతలు 'భిల్లా' లో ఆమె అందాల ప్రదర్శన చూసి తమ సినిమాల్లో (పెద్ద హీరో ప్రక్కనే సెకెండ్ హీరోయిన్ గా) అడిగారుట. కాని ఆమె తన డిమాండ్స్ లిస్టు వివరించిందిట. అంతేగాక రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువగా చెప్పిందిట. దాంతో ఆమె ఈ రేంజిలో బిల్డప్ ఇస్తుందని ఊహించలేదని వారు షాకయ్యారట. దాంతో తెలుగులో మాకు హీరోయిన్స్ కేమీ కొదవలేదు.త్రిష, నయనతార, ఇలియానా, జెనీలియా, తమన్నా, కమిలినీ ముఖర్జీ, అసిన్ వంటి అందగత్తెలు ఎందరో ఉన్నారు. అంతగా కాకపోతే ముంబాయి మోడల్స్ ఎలూనూ ఉన్నారు. ఏదో కొత్తగా ప్రయత్నం చేద్దామనుకున్నాం...అని తప్పుకున్నారుట.

తర్వాత కొంతకాలానికి దిగి వచ్చి ఆమె మేనేజర్ వారిని మళ్ళీ కాంటాక్ట్ చేసాడు. దానికి వారు మేం ఓ.కె అన్నా హీరోలు ఒప్పుకోవాలి కదా...అని వారిపై తోసేసారట. అంతే గాక తమకు తెలిసున్న వారితో నమిత డిమాండ్స్ కి ఒప్పుకుంటూ సినిమా చేయటం చాలా కష్టం అని ప్రచారం చేసారుట. వెటకారంగా తెరపై సగం ఆక్రమించే అందచందాలని ఎవరు ఆహ్వానిస్తారు అంటున్నారట. ఇవన్నీ తెలియక నమిత తెలుగులో తనకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తోందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X