అందుకే..నమితకు 'పెళ్ళి' అవసరం లేదు!!

ఆ మాటవినగానే అప్పటిదాకా ఉషారుగా తుళ్ళుతూ ఉన్నామె మూడంతా ఒక్క సారిగా మారిపోయింది. అప్పటికీ కూల్ గా నో కామెంట్స్ అని చెప్పటానికి ప్రయత్నించింది. అయినా కుదరలేదట. కాస్సేపాగి ..నా కెరీర్ ప్రారంభం రోజుల్లో ఓ ఫొటో గ్రాఫర్ తో నాకు ముడి పెట్టి రాశేసారు. నిజానికి అవి నన్ను చాలా హర్ట్ చేసాయి. అయితే దానికి నేను మీడియాని నిందించటం లేదు. వారు నాకు ప్రెండ్స్ ..వారి ఆబ్లిగేషన్ ని అర్ధం చేసుకుని స్పోర్టివ్ గా తీసుకున్నాను.
అయితే అదంతా గతం.. నేను మర్చిపోయాను. ఇప్పుడంత తీరిక లేదు. పెళ్ళి ఆలోచనే లేదు. అయినా నాకంత అవసరం ఇప్పట్లో ఉందని నేను భావించటం లేదు. కాబట్టి ఆ టాపిక్ వదిలేయిండి. ఈ సినిమాపై ప్రశ్నలు అడగండి,నా పాత్ర గురించి అడగండి చెబుతా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. దాంతో అక్కడి వారు ...కరెక్టే కదా ఏదో సాగుతూంటే పెళ్ళెందుకు అన్నట్లు ...నమితకు అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాల్సన అవసరం ఏముంది...అంత ఇబ్బంది ప్రస్తుతం లేదు కదా అని అనుకుంటా బయిటపడ్డారు.


Click it and Unblock the Notifications











