twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ భార్య నమ్రతే మొత్తం డీల్ చేస్తోంది

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందిలో రీమేక్ కు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నారు. అందునిమిత్తం మొత్తం బిజినెస్ డీలింగ్ లు మొత్తం నమ్రత చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. ఆమె రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సోదరితో మాట్లాడారని,అలాగే బాడీగార్డ్ నిర్మాత అతుల్ ఆగ్నిహోత్రిని కూడా ఆమె కాంటాక్ట్ చేసి దూకుడు గురించి మాట్లాడాలంటే తనని కలవమని హైదరాబాద్ రమ్మని ఆహ్వానించిందని రాసుకొచ్చాయి. అంటే నమ్రతే ఈ చిత్రం రీమేక్ లో భాగస్వా మిగా ఉండబోతోందని చెప్తున్నారు. అలాగే మహేష్ సోదరుడు రమేష్ తెలుగు దూకుడుకి సమర్పకుడుగా వ్యవహించారు. అలాగే హిందికి నమ్రత మొత్తం చూస్తుందని, ఎగ్డిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

    మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు రీమేక్ రైట్స్ కు అన్ని చోట్ల నుంచి పోటీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహేష్ తన హిందీ రీమేక్ కు సల్మాన్ ఖాన్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు అని ఓ డైలీ తో మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే గతంలో తన పోకిరి చిత్రాన్ని సల్మాన్ రీమేక్ చేసి హిట్ కొట్టడం గుర్తు చేసి చెప్తున్నాడు. ఇక దూకుడు నిర్మాతలే హిందిలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచలో ఉన్నారుట. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే అక్షయ్ కుమార్ ట్రైల్స్ వేస్తున్నారు. మరో ప్రక్క అజయ్ దేవగన్ కూడా తన నిర్మాతలను ఈ సినిమా కోసం పంపుతున్నాడు.

    ఇక మహేష్ మాటను సల్మాన్ పాజిటివ్ గా తీసుకుని ముందుకు వచ్చి ఈ రీమేక్ ప్రారంభించే అవకాసం ఉంది. ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్ రీమేక్ లో ఉన్నారు. అలాగే మొన్నే బాడీగార్డు,రెడీ రీమేక్ లు చేసారు. మరో ప్రక్క తెలుగులో హిట్ అయిన కాంచన చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ అన్ని భాషల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోలు సైతం కామిడీ సినిమాలు అంటేనే ఆసక్తి చూపుతూ వాటిమీదే కాన్సర్టేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Mahesh's wife Namrata is dealing with the Bollywood filmmakers about this Dookudu Hindhi Remake Rights. She has been contacting Salman Khan's aides for some time, says Bollywood buzz.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X