వారిని మహేష్ బాబుకు దూరం పెడుతున్న నమ్రత!
హైదరాబాద్: ఇటీవల మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెలుతున్న మహేష్ బాబును ఈ సినిమా ఫలితం డిస్సప్పాయింటుకు గురి చేసింది. ఫలితంగా ఆయనకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.
‘ఆగడు' ఫలితం తర్వాత ఎప్పుడు పడితే వారు మహేష్ బాబును కలవడానికి కొందరు బడా నిర్మాతలకు సైతం అస్సలు వీలు కావడం లేదు. దానికి కారణం ఆయన నమ్రతే అంటున్నారు. ఇటీవల ఓ నిర్మాత మహేష్ బాబును కలిసి సినిమా ప్రపోజల్ పెట్టి స్టోరీ చెప్పి వెళ్లి పోయారట. ఆయన వెళ్లిన తర్వాత నమ్రత సెక్యూరిటీపై సీరియస్ అయినట్లు సమాచారం.

ముందస్తు సమాచారం లేకుండా ఎవరినీ లోకినికి రానీయొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందట. ఈ మధ్య కాలంలో కొందరు మహేష్ బాబు చుట్టూ చేరి హడావుడి చేయడం ఎక్కువైందని, వారి మూలంగా మహేష్ బాబు డిస్ట్రబ్ చేయడం ఎక్కువైందని, వారి మూలంగానే మహేష్ బాబు కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నారనే భావనలో నమ్రత ఉందని, అందుకే ఆమె రంగంలోకి దిగి వారిని వీలైనంత వరకు మహేష్ బాబుకు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్.
మహేష్ బాబు తాజా సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. మైత్రి మూవీస్ సంస్థ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











