»   » మహేష్ ఫ్యాన్స్ ని నమ్రత చీట్ చేసిందంటారా..సేవ్ చేసిందంటారా....

మహేష్ ఫ్యాన్స్ ని నమ్రత చీట్ చేసిందంటారా..సేవ్ చేసిందంటారా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య ట్విట్టర్ లో ఎక్కువగా కనిపించడంలేదు. ఆమధ్య గౌతమ్ ని ప్రమోట్ చేయడానికి ట్విట్టర్ ని ఉపయోగించిన మహేష్ ఆ తర్వాత తన సినిమా విశేషాలను కూడా వివరించేవాడు. ప్రతి యొక్క విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసేవాడు. అయితే ఇన్ని రోజులు ట్విట్టర్ లో మహేష్ బాబుతో ఇంటరాక్ట్ అవుతోంది మహేషే అనుకునేవారికి ఒక షాకింగ్ న్యూస్.

మహేష్ బాబు కంటే అతని భార్య నమ్రతే ఎక్కువగా ఫాన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతోందని సమాచారం. అందుకు కారణం మహేష్ సినిమాలు లేటవ్వడం, ఒక్క హీరోకి, ఫ్యాన్స్ కి మద్య ఉన్న క్రేజ్ తగ్గపోకుండా ఉండాలంటే ఫ్యాన్స్ కి దగ్గరయ్యేందుకు ట్విట్టర్ సలహా మహేష్ బాబుకు ఇచ్చింది నమ్రతే. అయితే సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ వల్లనో లేక ఏ ఇతర కారణాలవల్లనో అన్ని సమయాల్లోనూ మహేష్ బాబే విషయాలను పోస్ట్ చేయలేకపోయి ఉండవచ్చు. మహేష్ పేరుతో నమ్రతే ఎక్కువ సార్లు ప్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిందని తెలిసినా ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే ఫ్యాన్స్ కి కావాల్సిందే తమ యొక్క హీరో ఏ పొజీషన్ లో ఉన్నాడు, అతని సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పడు నమ్రత అందిస్తోంది కాబట్టి ఓకే అని అడ్జెస్ట్ అయిపోయి థాంక్స్ చెబుతారో లేక నమ్రత చీట్ చేసిందని చీదలించుకుంటారు ఫ్యాన్స్ కే వదిలేద్దాం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu