మహేష్ బాబు యాడ్స్‌కు నమ్రతా శిరోద్కర్ 'ఐడియా'
ప్రస్తుతం తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఒక్కడే ఎక్కువగా యాడ్స్ చేస్తున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు మెగాస్టార్ చిరంజీవి థమ్సప్, నవరత్న ఆయిల్ తదితర యాడ్స్ చేస్తే తమ్ముడు పవన్ కల్యాణ్ పెప్సీ తదితర యాడ్స్ చేసే వాడు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరు యాడ్స్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజను వరించాయి. పెప్సీ, థమ్సప్ యాడ్స్‌ను బావబావమరుదులు పంచుకున్నారు. తాజాగా థమ్సప్ యాడ్ మాత్రం మహేష్ బాబు చేస్తున్నాడు. అంతకుముందు కూడా పలు యాడ్స్ చేశాడు.
థమ్సప్ తర్వాత ఐడియా యాడ్ చేయబోతున్నాడంట. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన గెట్ ఐడియా ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ ఐడియా 3జి యాడ్‌లో తెలుగులో గెట్ ఐడియా అని కనిపించనున్నాడంట. అయితే మహేష్ బాబుకు ఉన్న ఆదరణే అన్ని యాడ్స్ తీసుకు వస్తుందనేది నిజం అయినప్పటికీ యాడ్స్ రావడం వెనుక మరో కోణం కూడా ఉందంట. అదే మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్. బాలీవుడ్ భామ అయిన నమ్రతా శిరోద్కర్‌కు ముంబయిలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమెకు బాలీవుడ్‌లో ఉన్న పరిచయాల కారణంగానే మహేష్ బాబుకు కుప్పలు తెప్పలుగా యాడ్స్ వచ్చి పడుతున్నాయంట.
దీంతో ఇప్పుడు మహేష్ బాబు సినిమాల కంటే యాడ్స్ పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడంట. ఇప్పటికే మహేష్ అభిమానులు తమ హీరో ఏ సంవత్సరానికో ఒక సినిమా చేస్తాడనే నిరుత్సాహంలో ఉన్నారు. ఇక ఇప్పుడు యాడ్స్ తోడై మహేష్ సినిమాల మధ్య మరింత గ్యాప్ పెరిగితే ఇక అభిమానులు మరింత నిరుత్సాహపడక తప్పదు. మహేష్ యాడ్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను నమ్రతనే చూస్తున్నారంట.


Click it and Unblock the Notifications











