For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అడవి శేష్ హీరోయిన్ కోసం నమ్రత పాట్లు.. ఆ అందాల తారతో మంతనాలు

  By Manoj
  |

  అప్పుడెప్పుడో వచ్చిన 'సొంతం' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు యంగ్ హీరో అడవి శేష్. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే కావడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, తర్వాత పవన్ కల్యాణ్ 'పంజా', రవితేజ 'బలుపు' సినిమాల్లో విలన్‌గా నటించిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఇక, 'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' వంటి వినూత్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు ఈ యంగ్ హీరో. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  అడవి శేష్‌కు అన్నీ తెలుసు

  అడవి శేష్‌కు అన్నీ తెలుసు

  క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైనా.. ఆ తర్వాత విలన్‌గా ఎంతో పేరును సంపాదించుకున్నాడు అడవి శేష్. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. యాక్టింగ్ వైపు మాత్రమే కాకుండా కథలు రాయడంలోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే అతడు ‘క్ష‌ణం', ‘గూఢ‌చారి', ‘ఎవరు'కు కథలు అందించాడు. అలాగే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లోనూ సత్తా చాటాడు.

   ఈ సినిమాలతో మంచి పేరు

  ఈ సినిమాలతో మంచి పేరు

  అడవి శేష్‌ చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంచి పేరును దక్కించుకోవడానికి కొన్ని సినిమాలు ఉపయోగపడ్డాయి. వాటిలో ‘క్ష‌ణం', ‘గూఢ‌చారి', ‘ఎవరు', ‘బాహుబలి' సహా ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలాగే, కొన్ని సినిమాలకు స్పెషల్ అప్పీరెన్సులు కూడా ఇచ్చిన ఈ హీరో.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

  వ్యక్తిగత జీవితంలోనూ స్పెషలే

  వ్యక్తిగత జీవితంలోనూ స్పెషలే

  ఈ యంగ్ హీరో వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో హుందాగా కనిపిస్తుంటాడు. అలాగే, ఎన్నో అంశాలు తెలుసుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలను చూసే శేష్.. వాటి ఆధారంగా సినిమాలు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే, వివాదాలకు దూరంగా ఉంటాడు. అందుకే సినీ పెద్దలందరూ ఇతడిని మెచ్చుకుంటారు.

  ప్రేమ పెళ్లి చేసుకుంటాను

  ప్రేమ పెళ్లి చేసుకుంటాను

  కొద్ది రోజుల క్రితం వచ్చిన ‘ఎవరు' సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను అడవి శేష్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆ సమయంలో తన ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడాడు. తాను కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పాడు. అయితే, అమ్మాయి ఎవరు.? ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడా? అనే విషయాలు మాత్రం చెప్పలేదు.

  మహేశ్ బాబు చేతిలో పడ్డాడు

  మహేశ్ బాబు చేతిలో పడ్డాడు

  అడవి శేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మేజర్'. సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ‌శికిర‌ణ్ తిక్క. దీనికి కథా సహాకారం అందించింది కూడా శేష్ కావడం విశేషం.

  భార్యను వెదుకుతున్న మహేశ్ బాబు భార్య

  భార్యను వెదుకుతున్న మహేశ్ బాబు భార్య

  ఈ సినిమా వ్యవహారాలను మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరో పాత్రకు భార్యగా చేసే నటి కోసం ఆమె అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నమ్రత.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో చర్చలు జరిపారని తాజా సమాచారం. తెలుగు, హిందీ భాష‌ల్లో వస్తున్న సినిమా కావడంతోనే ఇలా ప్లాన్ చేశారని టాక్.

  English summary
  Biopics seem to be a flavour of the season across film industries. From Sye Raa Narasimha Reddy, J Jayalalithaa's biopic Thalaivi to Narendra Modi's biopic, many biographic films are in the making. The latest one to join the list is Hindi-Telugu bilingual flick, Major.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X