సతీమణి కోసం మహేష్ బాబు తొలిసారి.. 30 నిమిషాల గెస్ట్ రోల్!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ తో సినిమా అంటే 100 కోట్లకు కుమ్మరించడానికి నిర్మాతలు రెడీ అయిపోతారు. అలాంటి మహేష్ ఇటీవల కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్ర నిర్మాణంలో మహేష్ కూడా కొంత వాటా ఉంది. ఇదిలా ఉండగా మహేష్, ఆయన సతీమణి నమ్రత ఒక విన్నూత్న ప్రయత్నానికి తెరతీసినట్లు ప్రచారం జరుగుతోంది.

పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలోకి
మహేష్ శ్రీమంతుడు చిత్రంలో నటిస్తున్న సమయంలో నమ్రత నిర్మాణానికి సంబందించిన కొన్ని పనులు చూసుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాలనేది మహేష్, నమ్రత ఆలోచనగా తెలుస్తోంది. ముందుగా తక్కువ బడ్జెట్ లో ఇతర హీరోలతో సినిమాలు నిర్మించాలనేది వీరి ఆలోచన.

నమ్రత కోసం
జి మహేష్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో మహేష్ నిర్మాణ సంస్థ పార్రంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. తమ నిర్మాణంలో వచ్చే తొలి చిత్రంలో మహేష్ బాబు కనిపించాలనేది నమ్రత ఆలోచన. దీనికోసం ఓ ఎమోషనల్ డ్రామాగా కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ గెస్ట్ రోల్ లో 30 నిమిషాలు కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. నమ్రత ఆలోచనకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

తొలిసారి ఈ ప్రయత్నం
మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ లో నటించలేదు. ఈ ఆలోచన అమలైతే మహెష్ గెస్ట్ రోల్ లో కనిపించడం తొలిసారి అవుతుంది. మరోవైపు మహేష్ బాబు థియేటర్ బిజినెస్ లోకి కూడా దిగిన సంగతి తెలిసిందే. ఏఎంబి మల్టిఫ్లెక్స్ పేరుతో త్వరలో మహేష్ బాబు థియేటర్స్ ప్రారంభించబోతున్నాడు.

వరుసగా చిత్రాలు
ప్రస్తుతం మహేష్ బాబు వరుస చిత్రాలతో బిజీగా కాబోతున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. సుకుమార్ చిత్రం వచ్చే ఏడాది పార్రంభం కానుంది. మహర్షి చిత్రానికి వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











