చరణ్ ‘ఆరెంజ్’ రేంజ్ దాటలేకపోయింది మరి ‘మెరుపు’ఖ్యాతి ఎంత మేరో...!?

By Sindhu

'మగధీర" లాంటి చిత్రంతో మహోన్నతమైన శిఖరాలకు చేరుకున్న రామ్ చరణ్ ఖ్యాతి, 'ఆరెంజ్" చిత్రంతో ఏ రేంజో అర్థం కాకుండా అయిపోయింది. అలాంటి ఈ తరుణంలో ధరణి దర్శకత్వంలో రాబోతున్న 'మెరుపు" మరో సంచలనానికి దారి తీసింది. అలనాటి 'విజేత" చిత్రంలో చిరంజీవి పోషించిన ఫుట్ బాల్ ఆటగాడిలాంటి పాత్రనే మళ్లీ ఈనాటి 'మెరుపు"లో చరణ్ పోషిస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ 'మెరుపు"కు మరో 'ఉరుము"తోడు కాబోతుంది.

రామ్ చరణ్ లాంటి ఓ నైపుణ్యం గల ఫుట్ బాల్ ఆటగాడి భవితవ్యానికి కొత్త జీవం పోసి, సినిమాలో ఫెర్ఫార్మెన్స్ పరంగా హైట్స్ లో నిలిచే ఓ పవర్ ఫుల్ 'కోచ్"పాత్రకి బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లేదా తమిళ నటుడు అర్జున్ పేర్లను ఓకే చేయబోతున్నట్టు సమాచారం. నటన పరంగా రామ్ చరణ్ 'మెరుపు"కి సరిజోడైన ఈ 'ఉరుము"లాంటి పాత్రలో పైన పేర్కొన్న ఇద్దరిలో ఎవరు తోడైనా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కంపల్సరీ అనుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X