SSMB29: 15 రోజులకు 20 కోట్ల రెమ్యునరేషన్.. రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్!
బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్‌ని హాలీవుడ్ రేంజ్‌లో నిలబెట్టారు. ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనతను అందుకున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా.. దేశంలో నెంబర్ వన్ దర్శకుడు ఇప్పట్లో రాజమౌళియే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇటీవల జరిగిన వేవ్స్ సమ్మిట్‌తో జక్కన్న ప్రతిభను మెచ్చుకున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్ బడా నిర్మాతలు వందలు, వేల కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉన్నారు.
రాజమౌళి ఆఫర్ కోసం బాలీవుడ్ వెయిటింగ్
రాజమౌళి సినిమాలో చిన్న ఛాన్స్ దొరికినా చాలని అనుకునే స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్ బిగ్‌స్టార్స్ మొత్తం జక్కన్న గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఓ నటుడు మాత్రం స్వయంగా రాజమౌళి ఆఫర్ ఇస్తే తిరస్కరించాడట. భారీ రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్ ఇస్తామన్నా ఆ నటుడు నో చెప్పాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ నటుడు ఎవరు? ఏకంగా రాజమౌళి ఆఫర్ ఇస్తే ఎందుకు తిరస్కరించాడు? ఈ వివరాల్లోకి వెళితే..

జెట్ స్పీడ్‌తో SSMB29 షూటింగ్
ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 అనే సినిమా చేస్తున్నారు రాజమౌళి. టాలీవుడ్ నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఒడిషాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఈ చిత్ర యూనిట్ అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతోంది. పలువురు నటులు ఎస్ఎస్ఎంబీ 29లో భాగమయ్యారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి వార్తలు రాగా.. ఆయన ఈ సినిమాలో భాగమయ్యారు. దీంతో గాసిప్స్‌ను అంత తేలిగ్గా కొట్టేయడం లేదు జనాలు.
జక్కన్న ఆఫర్ రిజెక్ట్ చేసిన నానాపటేకర్?
తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం రాజమౌళి ఓ బాలీవుడ్ నటుడిని సంప్రదించదంతో పాటు 20 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట. అయినప్పటికీ ఆ నటుడు జక్కన్నకి నో చెప్పారట. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాతో తెగ ప్రచారం చేస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు హిందీ పరిశ్రమకు చెందిన దిగ్గజం నానా పటేకర్. ఎస్ఎస్ఎంబీ కోసం రాజమౌళి స్వయంగా పూణే వెళ్లి నానా పటేకర్‌ను కలిశారట. పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలని ఇందుకోసం రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట జక్కన్న.
బాలీవుడ్ తప్పు ప్రచారమే
అయితే కథ, తన పాత్ర ఎంతో బాగున్నప్పటికీ.. ఈ రోల్‌కు తాను న్యాయం చేయలేనంటూ నానాపటేకర్ భావించి సున్నితంగా రాజమౌళికి నో చెప్పినట్లుగా ఆ న్యూస్ సారాంశం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మహేశ్ అభిమానులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా హిందీ మీడియా, బాలీవుడ్ వర్గాలు చేస్తున్న తప్పుడు ప్రచారమని మండిపడుతున్నారు. రాజమౌళి అడిగితే చిన్న పాత్రలోనైనా కనిపించేందుకు బాలీవుడ్ స్టార్స్ మొత్తం క్యూకడతారని.. అలాంటిది నానాపటేకర్ ఎందుకు అంగీకరించరని ప్రశ్నిస్తున్నారు. సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వార్త నిజమో? అబద్ధమో తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











