‘మీ టూ’ నటుడిపై కన్నేసిన త్రివిక్రమ్‌.. అల్లు అర్జున్ కోసం కొత్త విలన్ అతనేనట!

Recommended Video

Famous Bollywood Star To Act In Trivikram Srinivas-Allu Arjun Upcoming Movie | Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విలక్షణ నటుడు నానా పాటేకర్ టాలీవుడ్‌లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోమన్ ఇరానీ, ఉపేంద్ర లాంటి పరభాష నటులను టాలీవుడ్‌లోకి దిగుమతి చేసుకొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నానా పాటేకర్‌పై దృష్టిపెట్టినట్టు ఓ వార్త వైరల్‌గా మారింది. త్వరలో ప్రారంభం కానున్న అల్లు అర్జున్ సినిమా కోసం నానాను బరిలో దించేందుకు త్రివిక్రమ్ వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సినిమా రీమేక్‌లో

హాలీవుడ్ సినిమా రీమేక్‌లో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత హిందీలో హిట్టయిన సోను కే టిటూ కి స్వీటీ అనే సినిమాను రిమేక్ చేయాలన్ని ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నాన్ని మానుకొని హాలీవుడ్‌లో క్రేజీగా రూపొందిన రొమాంటిక్ చిత్రం ఇన్వెన్షన్ ఆఫ్ లైయింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అల్లు అర్జున్‌ను హీరోగా ఎంచుకొన్న సంగతి తెలిసిందే.

నానా పాటేకర్‌తో సంప్రదింపులు

నానా పాటేకర్‌తో సంప్రదింపులు

తన తదుపరి చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం నానా పాటేకర్‌ను త్రివిక్రమ్ సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నానాతో సంప్రదింపులు చేస్తున్నారని, అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే నానా సెలక్షన్‌ గురించి అధికార ప్రకటన వెల్లువడే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 డబ్బింగ్ రైట్స్, అల్లు అర్జున్ మార్కెట్

డబ్బింగ్ రైట్స్, అల్లు అర్జున్ మార్కెట్

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల మార్కెట్ దేశవ్యాప్తంగా ఉంది. డబ్బింగ్ రైట్స్‌కు భారీగా పారితోషికం లభిస్తుండటంతో హిందీ తారలపై తెలుగు దర్శకులు కన్నేస్తున్నారు. అలాగే ఉత్తరాదిలో అల్లు అర్జున్‌కు కూడా మార్కెట్ బాగా ఉండటంతో నానాను ఈ ప్రాజెక్ట్‌లో చేర్చితే మరింత క్రేజీగా ఉంటుందనే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

 నానా పాటేకర్‌పై మీటూ ఆరోపణలు

నానా పాటేకర్‌పై మీటూ ఆరోపణలు

అయితే బాలీవుడ్‌లో నానా పాటేకర్ మీ టూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆయనపై దారుణమైన కామెంట్లు, ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. ఆ నేపథ్యంలో నానా పాటేకర్‌ను గోల్ మాల్ సిరీస్‌ నుంచి తప్పించారు. నానా స్థానంలో రానాను తీసుకోవడం తెలిసిందే. ఒకవేళ అల్లు అర్జున్ చిత్రంలో నానా నటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X