twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనాకు నో చెప్పిన బాలయ్య.. వాటి ఫలితాలను చూసే అలా ఫిక్స్ అయ్యాడా?

    |

    నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వీయ నిర్మాణంలో నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూశాయి. కలెక్షన్స్ పోతే పోనీలే అనుకుంటూ.. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ తేలిపోయాడనే కామెంట్స్ రావడం అందర్నీ ఆశ్చర్యకలిగించింది.

    Recommended Video

    Nanadamuri Balakrishna Say No For Kangana Thalaivi
    సూట్ కాని బాలయ్య..

    సూట్ కాని బాలయ్య..

    ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఏ మాత్రం సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. అయితే మహానాయకుడు సినిమాలో అంతో ఇంతో పర్వాలేదనిపించేలా చేశాడని కామెంట్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఆ చిత్రాలుంటాయని అంతా భావించినా.. అవి బెడిసి కొట్టాయి. ఇక మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించాలని కోరినా బాలయ్ మాత్రం ఒప్పుకోవడం లేదట.

    కంగనా తలైవి..

    కంగనా తలైవి..

    ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తలైవిగా వస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ కీలకపాత్ర పోషిస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు.

    బాలయ్యను సంప్రదించిన యూనిట్..

    బాలయ్యను సంప్రదించిన యూనిట్..

    అయితే జయలలిత, ఎన్టీఆర్ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తలైవిలోనూ ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయాలని యూనిట్ భావించిందట. ఈ మేరకు ఎన్టీఆర్ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించారని టాక్.

    నో చెప్పిన బాలయ్య..

    నో చెప్పిన బాలయ్య..

    అయితే ఎన్టీఆర్ పాత్రలో మరోసారి నటించకూడదని బాలయ్య నిశ్చయించకున్నాడని టాక్ .అందుకే వారికి సున్నితంగా నో చెప్పి పంపించాడట. ఏదైమైనా.. బాలయ్య ఎన్టీఆర్ సినిమా పెద్ద షాక్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఇక బాలయ్య ఒప్పుకోకపోవడంతో.. తలైవిలో ఎన్టీఆర్ సీన్స్ లేకుండానే కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది.

    English summary
    Nanadamuri Balakrishna Say No For Kangana Thalaivi. Buzz is That Balayya Rejectd NTR Role InThlaivi Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X