మైండ్ బ్లోయింగ్ న్యూస్.. సినిమాల్లోకి ఎన్టీఆర్​ పెద్ద కొడుకు.. సితారతో కలిసి పాన్ వరల్డ్​ మూవీలో!

యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ - సూపర్ స్టార్​ మహేశ్​బాబు కలిసి ఒకే స్టేజ్​పై కనిపిస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరు. ఇప్పటికే వీరిద్దరు 'ఎవరు మీలో కోటీశ్వరులు' సహా కలిసి ఇతర ఈవెంట్లలో స్టేజ్​ను పంచుకున్నారు. ఆ సమయంలో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడా ఆనందానికి రెండింతలు ఎక్కువ సంతోషానిచ్చే వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండే అనుబంధం, స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి ఎన్టీఆర్​-ఏఎన్నార్‌-కృష్ణ నుంచి ఇప్పటి రామ్​చరణ్​-ఎన్టీఆర్-మహేశ్​బాబు​ వరకు చాలా మంది మంచి బెస్ట్​ ఫ్రెండ్స్​, బ్రదర్స్​గా మంచి రిలేషన్​షిప్ ఉంది. వీరంతా చాలా సందర్భాల్లో ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటూనే ఉంటారు. ఒకరికి మరొకరు అండగా నిలుస్తుంటారు. అలాగే ఒకరి సినిమా ఈవెంట్లకు మరొకరు హాజరై సందడి చేస్తుంటారు. అయితే ఇప్పుడా అనుబంధాన్ని కొత్త తరం పిల్లలు కూడా కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది.

Nandamuri Abhay Ram and Little Princess Sitara in Mahesh Babu Rajamouli Pan India Movie News Viral in Social Media

మహేశ్-ఎన్టీఆర్ అనుబంధం: ఇండస్ట్రీలో ఎన్టీఆర్​ - ​ మహేశ్​ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు తమ చిత్రాలతో భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. చాలా సందర్భాల్లోనూ ఎన్టీఆర్​.. మహేశ్​ను అన్న అంటూ ఎంతో అప్యాయంగా పలకరిస్తుంటారు.

మహేశ్​ కూడా అంతే ప్రేమగా మాట్లాడుతుంటారు. చాలా సార్లు వీరిద్దర్లు పలు ఈవెంట్లలో ఒకే స్టేజ్​ను పంచుకున్నారు కూడా. ఆ సమయంలో అభిమానులు ఎంతగానో సంతోషపడిపోయారు. అయితే ఇప్పుడు వీరిద్దరి పిల్లలు కూడా ఒకే స్టేజ్​ను పంచుకోబోతున్నారని తెలిసింది. అవును మీరు విన్నది నిజమే. అది కూడా సినిమాలో.

Nandamuri Abhay Ram and Little Princess Sitara in Mahesh Babu Rajamouli Pan India Movie News Viral in Social Media

అభయ్​ రామ్​-సితార కలిసి: ఇప్పటికే చిత్రసీమలో స్టార్ కిడ్స్​ ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ, అల్లు అర్జున్​, సుధీర్​బాబు, మహేశ్ బాబు సహా ఇతర హీరోల పిల్లలు సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్​ పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా ఇవ్వబోతున్నాడు. అది కూడా మహేశ్ కూతురు సితారతో కలిసి స్క్రీన్ పంచుకోనున్నాడట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Nandamuri Abhay Ram and Little Princess Sitara in Mahesh Babu Rajamouli Pan India Movie News Viral in Social Media

ఇంతకీ ఏ సినిమా అంటే: దర్శకధీరుడు రాజమౌళి.. మహేశ్​బాబుతో కలిసి ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్​ జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇంట్రడక్షన్ సీన్ ఓ 20 నిమిషాల పాటు ఉండనుందట. దీని కోసం సితార -ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్​ను సెలెక్ట్ చేశారట రాజమౌళి. సినిమాకి ఈ 20 నిమిషాల కథ ఎంతో కీలకంగా ఉంటుందట. వీరిద్దరు అక్కాతమ్ముళ్లుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Nandamuri Abhay Ram and Little Princess Sitara in Mahesh Babu Rajamouli Pan India Movie News Viral in Social Media

ఫ్యాన్స్ కు పండగే!: మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఎన్టీఆర్ కొడుకు తొలిసారి తెరపై కనిపించినట్టవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక్​ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఇప్పటికే మహేశ్ కూతురు సితార.. సర్కారు వారి పాటలో ఓ సాంగ్​లో చిందులేసిన సంగతి తెలిసిందే..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X