బాలకృష్ణ న్యూ మూవీ స్టోరీ లీక్.. ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేలా కాన్సెప్ట్.. టైటిల్ అదేనా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా వారి మార్కెట్ పెంచుకునే విధంగా పెద్ద సినిమాలను చేస్తున్నారు. బాలకృష్ణ అఖండ సినిమాతో ఇప్పటికే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో బాలయ్య కెరీర్ లోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఇక తర్వాత చేయబోయే సినిమా విషయంలో కూడా బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఉంటుంది అని ప్రస్తుతం ఒక టాక్ అయితే కొనసాగుతోంది. అంతేకాకుండా టైటిల్ కూడా ఫిక్స్ అయిందని కూడా అంటున్నారు.

వరుస డిజాస్టర్స్

వరుస డిజాస్టర్స్

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా కంటే ముందు వరుస డిజాస్టర్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆయన సినిమా జీవితంలోని ఒక మర్చిపోలేని చేదు అనుభవంగా కలెక్షన్స్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా మాస్ ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. అందుకే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడోసారి కలిసి చేసేసెంటిమెంట్గా హిట్ కొట్టాడు.

మరోసారి రుజువైంది

మరోసారి రుజువైంది

అఖండ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య బాబు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఆ సినిమా ఫైనల్ గా వంద కోట్ల మార్కెట్ క్రియేట్ చేయగలిగింది. ఇక 50 రోజుల వరకు అదే హడావిడితో కనిపించడంతో ఆయన మళ్ళీ ఫాంలోకి వచ్చినట్లు గా క్లారిటీ గా అర్థమైంది. బాలయ్య బాబు స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక మాస్ సినిమాను ను తెరపైకి తీసుకు వస్తే ఏ విధంగా ఉంటుందో మరోసారి రుజువైంది.

ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా..

ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా..

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాలయ్య 107 వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఆ సినిమా లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం లో కనిపించే అవకాశం ఉందట. అంతేకాకుండా గోపీచంద్ మలినేని క్రాక్ తరహాలోనే కొన్ని నిజజీవిత సంఘటనలతో స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే విధంగా కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉంటాయట.

రాజకీయ అంశాలు..?

రాజకీయ అంశాలు..?

అనంతపురం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నే పూర్తి సినిమా కొనసాగుతుందని ప్రస్తుతం కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అనంతపురం, రాయలసీమ సంక్షేమం కోసం రావాల్సిన ప్రాజెక్టులను కావాలని రాకుండా అడ్డుపడ్డారని, తెలివిగా రాజకీయం చేసినట్లుగా ఏపీలో టాక్ కొనసాగుతోంది. ఇక అదే అంశాన్ని సినిమాలో హైలెట్ చేయనున్నట్లు సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మళ్ళీ గోపిచంద్ మలినేని కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టైటిల్ ఫిక్స్..?

టైటిల్ ఫిక్స్..?

నందమూరి బాలకృష్ణ ఒక పాత్రలో యువకుడిగా, మరొక పాత్రలో 60 ఏళ్ళ వృద్ధుడి గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక సీనియర్ బాలకృష్ణను సినిమాలో పెద్దాయన అని పిలుస్తారట. సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X