'జై బాలయ్య' అనబోతున్న బాలకృష్ణ.. నందమూరి అభిమానులకి పూనకాలే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు గ్యాప్ లేకుండా వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక విధంగా నేటి యువతరం హీరోల కంటే కూడా ఐదు పదుల వయసు దాటినా సీనియర్ నటులు చాలా వేగంగా సినిమాలను సెలెక్ట్ చేసి పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా అఖండ సినిమా తర్వాత మరింత వేగాన్ని పెంచాలని అనుకుంటున్నాడు.

హ్యాట్రిక్ హిట్ కోసం..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఒక సాంగ్ విడుదల చేసి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు. ఈ సినిమాతో బాలయ్య తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని అభిమానులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చాలా కాన్ఫిడెన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నిజ జీవిత ఘటనల ఆధారంగా
అఖండ సినిమా అనంతరం బాలకృష్ణ అంతకుమించి అనేలా ఉండాలని గోపీచంద్ మలినేని ప్రాజెక్టు తో బిజీ అవుతున్నాడు. ఆ సినిమా అనంతపురం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అత్యంత భారీ బడ్జెట్ తో
ఇక బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి చాలా కాలం అవుతుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ లో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకున్నాయి ఈ సినిమాకు టైటిల్ విషయంలో కూడా ఇటీవల చిత్ర యూనిట్ ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉందట.

జై బాలయ్య..
అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల రెండు మూడు టైటిల్స్ ను నందమూరి బాలకృష్ణ ముందుకు తీసుకు రాగా ఆయన మరొక టైటిల్ సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా అభిమానులకు నచ్చే విధంగా ఉండాలని చెప్పడం తో దర్శకుడు 'జై బాలయ్య' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ కు బాలక్రిష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Recommended Video

ఎన్టీఆర్ కు చాలా ఇష్టం..
బాలయ్య బాబు ఏలాంటి సినిమా చేసినా కూడా థియేటర్స్ లో జై బాలయ్య అంటూ నినాదాలు రావడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆ టైటిల్ అంటే చాలా ఇష్టం. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని జై బాలయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. కొందరు ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











