NBK 108: బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ టైటిల్.. ట్యాగ్ లైన్ కూడా అదిరింది!
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీర నరసింహారెడ్డి సినిమాతో మాస్ ఫ్యాన్స్ ను బాగానే మెప్పించాడు. అయితే ఆ సినిమా పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లను టచ్ చేసింది. ఇక నెక్స్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 108వ సినిమాతో తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య బాబు ఎదురు చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇంకా టైటిల్ విషయంలో మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్యలోనే చాలా రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా వాటిపై కూడా చిత్ర ఏ విధంగాను స్పందించలేదు. ఇక ఇప్పుడు మరొక టైటిల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ లైవుతోంది.

అలాగే ఒక ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ అయినట్లుగా దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యి ఉండవచ్చు అని కూడా అందరూ అనుకుంటున్నారు. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా అలాగే కథకు దగ్గరగా ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి "భగవత్ కేసరి" అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ట్యాగ్ లైన్ 'ఐ డోంట్ కేర్' అనే మరో పవర్ఫుల్ లైన్ కూడా జత చేయబోతున్నట్లు సమాచారం. బాలయ్య బాబు పాత్రకు తగ్గట్టుగానే అనిల్ రావిపూడి ఈ టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీలీల ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా బాలయ్య బాబుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక సినిమాను ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసతో సరికొత్త డైలాగ్స్ చెప్పబోతున్నాడు.


Click it and Unblock the Notifications











