NBK109: ఇద్దరు బ్యూటీలను లైన్‌లో పెట్టిన బాలయ్య.. మొత్తానికి తమన్‌కు హ్యాండ్ ఇచ్చాడుగా!
నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఆరు పదుల వయసు దాటినా బాలయ్యలో ఏ మాత్రం ఊపు తగ్గలేదు. ఆయన కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేయడమే కాదు.. వరుసగా హిట్లు కొడుతూ.. వారికి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య.. తన నెక్ట్స్ సినిమా వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరు.. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇక భగవంత్ కేసరి హిట్ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత... ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక షూటింగ్ కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

నందమూరి నటసింహం అఖండ, వీరసింహారెడ్డి హిట్స్ తర్వాత.. ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాను చేశాడు. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో కూతురి పాత్రలో శ్రీలీల నటించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య.

బాలయ్య, బాబీ మూవీ నుంచి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండ్ తర్వాత మళ్లీ బాలయ్యతో దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇక బాలయ్యకు హిట్స్ మీద హిట్స్ ఇచ్చిన తమన్ ను కాదని ఈ సారి దేవికి ఛాన్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఎస్ఎస్ తమన్.. బాలయ్య కాంబో హిట్ కాంబో. ఇక ఇప్పటికే వీరి కాంబోలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం దేవికి ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఇక ఈ సినిమాకు డీఓపీగా విజయ్ కార్తిక్ కన్నన్ వ్యవహారించనున్నారు. ఆయన జైలర్ సినిమాకు డీఓపీగా వ్యవహారించారు. ఇప్పుడు బాలయ్యను ఓ రేంజులో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, బ్రో చిత్రాల్లో ఐటెం సాంగ్ లో నటించిన ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించనుందట. ఇక ఈమెతో పాటు.. కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి కూడా నటించనుందని తెలుస్తోంది. ఈ భారీ తారాగణంతో బాలయ్య మరోసారి హిట్టు కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











