బాలయ్య అఘోరా లుక్‌పై లేటెస్ట్ అప్‌డేట్: ఫ్యాన్స్ కోసం అలా డిజైన్ చేసిన బోయపాటి
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ ఫార్మర్ రోల్‌తో పాటు అఘోరా పాత్రలోనూ నటించనున్న విషయం తెలిసిందే. ఈ గెటప్ గురించి కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య నిజంగానే అఘోరా పాత్రను పోషిస్తున్నాడట. అయితే, బూడిద పూసుకుని, గుబురు గెడ్డం.. పొడవైన జుట్టుతో కనిపించడట. అలా అయితే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన దర్శకుడు బోయపాటి.. అందులో కొన్ని మార్పులు చేసి చూపించబోతున్నాడని తెలుస్తోంది.

బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్‌గా చేస్తోంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ చిత్రం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











