Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Nandamuri Balakrishna: అఖండ న్యూ రిలీజ్ డేట్.. పోటీ ఎక్కువైనా తగ్గేది లేదట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. లాక్ డౌన్ ఎత్తి వేయడంతో విడుదల తేదీలను వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ యాక్షన్ మూవీ అఖండ కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి ఇటీవల ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నట్లు సమాచారం.
అప్పుడే రిలీజ్ చేయాలని..
సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలిసి చేస్తున్న మూడవ సినిమా కావడంతో అఖండపై అంచనాల గట్టిగానే పెరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వలన గ్యాప్ రావడంతో రిలీజ్ విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వచ్చే నెలలోనే..
షెడ్యూల్ కరెక్ట్ గా సెట్ చేసుకోగలిగితే షూటింగ్ పూర్తి చేయడానికి బాలకృష్ణ అందరికి కంటే త్వరగా రెడీగా ఉంటాడు. ఇక అఖండ విషయంలో కూడా దర్శకుడు బోయపాటి అలాంటి ప్లాన్ తోనే సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక చివరి షెడ్యూల్ మాత్రమే ఉంది. వచ్చే నెలలోనే మిగిలిన వర్క్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడట.
ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ..
ఇక సినిమా రిలీజ్ విషయంలో కూడా బాలకృష్ణ బోయపాటితో చర్చించినట్లు సమాచారం. షూటింగ్ అయితే మరో నెలలో తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. ఇక వినాయకచవితిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
అప్పుడే.. ఎందుకంటే?
సెప్టెంబరులో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకూడదని డిసైడ్ అయ్యారట. ముందుగానే రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. వినాయకచవితి సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వస్తోంది కాబట్టి బుధవారం రిలీజ్ చేసుకున్నా కూడా వీక్ మొత్తంలో 5 రోజులు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవచ్చని అనుకుంటున్నారట. మరి ఆ ప్లాన్ వర్కౌట్ కావాలి అంటే కరోనా పరిస్థితులు కూడా పూర్తిగా అదుపులోకి రావాల్సిందే.