twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖండ స్టోరీ లైన్ లీక్.. రొటీన్ అయినప్పటికీ సరికొత్త ట్రీట్మెంట్.. సినిమాలో అదే హైలెట్ సీన్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అఖండ సినిమా కూడా ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది గాని లేకపోతే ఎప్పుడో థియేటర్స్ లోకి వచ్చేది. ఇక సినిమాకు సంబంధించిన రూమర్స్ రోజుకోటి వైరల్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం సినిమా స్టోరీ లైన్ ఇదే అనే మరోక టాక్ కూడా వస్తోంది. బోయపాటి ఎప్పటిలానే రొటీన్ కథతోనే కాస్త డిఫరెంట్ ఎలివేషన్స్ ను క్రియేట్ చేసినట్లు సమాచారం.

    అఖండ కూడా అదే ఫార్మాట్ లో

    అఖండ కూడా అదే ఫార్మాట్ లో

    నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాలో నటిస్తున్నాడు అంటే ప్రేక్షకులు చాలా వరకు డైలాగ్స్ తో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలను కూడా కోరుకుంటారు. కథ ఎలా ఉందనేది కూడా కొన్నిసార్లు అవసరం లేదని చెప్పవచ్చు. రొటీన్ గా ఉన్నా కూడా ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తారనేది అసలు పాయింట్. అఖండ కూడా దాదాపు అదే ఫార్మాట్ లో రానున్నట్లు టాక్ వస్తోంది.

    అంతకు మించి అనేలా ఉండాలని

    అంతకు మించి అనేలా ఉండాలని

    బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇదివరకే రెండు వరుస బాక్సాఫీస్ హిట్స్ సినిమాలు వచ్చాయి. సింహా - లెజెండ్ ట్రెండ్ సెట్ చేయడంతో మూడవసారి రాబోయే అఖండ అంతకు మించి అనేలా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే బాలకృష్ణ పూర్తి కథ సెట్టయ్యే వరకు కూడా సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

    అసలు కథ ఇదే..

    అసలు కథ ఇదే..

    మొత్తానికి బోయపాటి ఏడాది పాటు కూర్చొని సెట్ చేసుకున్న స్క్రిప్టుపై బాలకృష్ణ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడట. ఇక అఖండ అసలు కథ ఏమిటంటే.. ముందు విలన్ బ్రదర్ ను హీరో చంపడం నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుందట. ఆ తరువాత హీరో అజ్ఞాతం నుంచి బయటకు రావడం అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది. బాలకృష్ణ రెండు విభిన్నమైన డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని డబుల్ యాక్షన్ అనే టాక్ కూడా వచ్చింది.

    Recommended Video

    Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
    సినిమాలో అఘోరా యాక్షన్ సీన్

    సినిమాలో అఘోరా యాక్షన్ సీన్

    సినిమా కథ రొటీన్ అయినప్పటికీ ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందట. చాలా వరకు బోయపాటి మునుపెన్నడు చూడని ఎపిసోడ్స్ ను సినిమాలో చూపిస్తున్నాడట. ముఖ్యంగా అఘోరా పాత్రలో ఒక భారీ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్ గా ఉంటుందట. 20 నిమిషాల పాటు ఉండే ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. మరి ఫైనల్ గా అఖండ అభిమానులను ఎంతవరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి.

    English summary
    Akhanda Cinema is also one of the most eagerly awaited movies by the audience. The rumors about the movie are going viral day by day. And now there is another talk coming that this is the movie story line. Information that Boyapati has created slightly different elevations with the same routine story as usual.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X