Akhanda Release Date: ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య.. అప్పటి నుంచే రచ్చ

కొంత కాలంగా విజయాన్ని అందుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ, విజయం మాత్రం వరించడం లేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా రోజులుగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'గా వస్తున్న బాలకృష్ణ

‘అఖండ'గా వస్తున్న బాలకృష్ణ

పరాజయాల పరంపరతో ఇబ్బంది పడుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. గతంలో రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

తొలిసారి అలాంటి పాత్రను చేసి

తొలిసారి అలాంటి పాత్రను చేసి

క్రేజీ కాంబోలో వస్తున్న 'అఖండ' మూవీ కోసం నందమూరి బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.

దక్షిణాదిలోనే బాలకృష్ణ రికార్డు

దక్షిణాదిలోనే బాలకృష్ణ రికార్డు

ఆ మధ్య 'అఖండ' టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల జాబితాలో సౌతిండియాలోనే మొదటి స్థానాన్ని అందుకున్నారు.

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

భారీ అంచనాలు.. బిజినెస్ ఇలా

'అఖండ' సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక డీల్స్ వచ్చాయి.

రిలీజ్ డేట్‌పై పుకార్లు షికార్లు చేసి

రిలీజ్ డేట్‌పై పుకార్లు షికార్లు చేసి

'అఖండ' సినిమాను మే 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అప్పుడు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. అప్పటి నుంచి చిత్రీకరణ మాత్రం శరవేగంగా సాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులు అయోమయంగా ఉన్నారు.

Recommended Video

Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు

ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు

హిట్ కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ' మూవీ రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని డిస్టిబ్యూటర్లకు సైతం అందించారట. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రానుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X