గ్యాంబ్లింగ్ తో 'అఖండ' వ్యూస్ .. అసలు లెక్కలు ఏంటి.. ఏం జరుగుతోంది ?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సినిమా టీజర్ మరిన్ని వ్యూస్ సాధిస్తూ ముందుకు వెళుతోంది. 12 రోజుల్లో 44 లక్షల వ్యూస్ రావడం అనేది ఇది ఒకరకంగా గొప్ప విషయమే. అయితే మిగతా పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకు సాధ్యం కాని ఈ ఫీట్ పెద్దగా ప్రమోషన్ కూడా చేయని బాలయ్య సినిమాకు ఎలా సాధ్యం అయింది ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇది గ్యాంబ్లింగ్ వల్ల జరిగింది అని, మార్కెటింగ్ టెక్నిక్స్ వలన ఇన్ని వ్యూస్ వస్తున్నాయని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

గ్లామర్‌తో అదరగొట్టిన రత్తాలు.. ఈ సమయంలో అక్కడ రాయ్ లక్ష్మి జిగేల్

గ్యాంబ్లింగ్ చేశారా ?

గ్యాంబ్లింగ్ చేశారా ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ లేడీ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా లుక్ లో కనిపించనున్నాడు అని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పటికే 44 మిలియన్ వ్యూస్ దాటి అరకోటికి చేరబోతోంది. అయితే ఈ వ్యూస్ రావడానికి వెనుక మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇన్ని వ్యూస్ రావడం అనేది అసాధ్యం అని ఇవి అన్నీ కొనుకున్న వ్యూస్ అని ఆరోపిస్తున్నారు.

మరి ఆ సినిమాలకు ఎందుకు రాలేదు

మరి ఆ సినిమాలకు ఎందుకు రాలేదు

నిజానికి ఆ ఆరోపణలు వచ్చినట్టుగానే కొన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ తో వ్యూస్ సాధించవచ్చు. అలా బాలకృష్ణ సినిమాకు డబ్బులతో వ్యూస్ తెప్పించి ఉంటారు అనుకుందాం, మరి మిగతా పెద్ద హీరోల సినిమాలకు కూడా అలాగే డబ్బులు పెట్టి తెప్పించి ఉండాలి కదా, మరి వాళ్ళకు రాని వ్యూస్ బాలయ్యకే ఎలా వచ్చాయి ? అని కూడా అనుమానం రావచ్చు. వాస్తవానికి క్రేజ్ ఉన్న సినిమాలు కొన్ని విడుదల చేసిన 24 గంటల్లోనే ఇన్ని మిలియన్ వ్యూస్ సాధించామని చెప్పుకోవడానికి రకరకాల మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఉంటాయి. గూగుల్ ద్వారా యూట్యూబ్ యాడ్స్ పెట్టించడం, లేదా ఇతర పార్టీ టెక్నాలజీలు ఉపయోగించి వ్యూస్ కొనుక్కోవడం లాంటి పనులు చేస్తూ ఉంటాయి. ఇది టాలీవుడ్ విషయంలో కొత్త ఏమీ కాదు.

 రెండు మూడు రోజులే ప్రమోషన్

రెండు మూడు రోజులే ప్రమోషన్

గతంలో ఒక పెద్ద సినిమా ప్రమోషన్ కోసం ఇలా మొదలు పెట్టిన ఈ వ్యూస్ ప్రక్రియ ఇప్పుడు పీక్ కి వెళ్ళింది. ఫ్యాన్స్ కు కూడా ఇది కాస్త కిక్కిచ్చే విషయంగా ఉండటంతో ప్రస్తుతానికి ఈ అంశం మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ మార్కెటింగ్ అంశాల మీద ఏమాత్రం అవగాహన ఉన్న వారికి అయినా ఈ టెక్నిక్స్ రెండు మూడు రోజులకు మించి కొనసాగించరు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి రెండు మూడు రోజులే కంటెంట్ లో విషయం ఉన్నా లేకపోయినా జనాల మీద రుద్దడానికి చూస్తారు. కానీ ఈ రెండు మూడు రోజుల తర్వాత ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు అనే కారణంతో ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఆపేస్తారు.

Recommended Video

Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
బాలయ్య సత్తా వల్లే

బాలయ్య సత్తా వల్లే

కానీ బాలకృష్ణ అఖండ విషయం సినిమా విషయంలో కూడా అలాగే ముందు ఒకటి రెండు రోజుల పాటు పెయిడ్ ప్రమోషన్స్ చేసి ఉంటారు అనుకుంటే విడుదల చేసి దాదాపు పది పన్నెండు రోజులు దాటిన తర్వాత కూడా ఈ సినిమా టీజర్ ఇంకా మున్ముందుకు పోతోంది. సో ఆరోపణలు వినిపిస్తున్నట్లుగా దీనిని పూర్తిగా గ్యాంబ్లింగ్ అని మార్కెటింగ్ టెక్నిక్ అని అనలేము. బాలయ్య అఖండ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కొత్తదనం కనిపిస్తుండడంతో ఎక్కువ సార్లు రిపీట్ చేసి చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యూస్ వెనుక ఉన్న అసలు కధ ఏమిటో తెలియక పలువురు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. బాలయ్య అభిమానులు మాత్రం రికార్డ్ వ్యూస్ తో పండగ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X