Akhanda 2: బాలయ్యకు విలన్‌తో తలనొప్పి.. టెన్షన్‌లో బోయపాటి?
టాలీవుడ్ హిట్ కాంబోస్ రిపీట్ అవ్వుతున్నాయి అంటే ఆ హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ ఎప్పుడు బోర్ కొట్టవు. అలాంటి కాంబోస్ లో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబో ఒకటి. బాలయ్య మాస్ గురించి అందరికి తెలుసు.. కానీ, ఆ మాస్ కే ఊర మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం బోయాకు మాత్రమే తెలుసు. మొట్టమొదటిసారి సింహా సినిమాతో ఈ కాంబో మొదలయ్యింది.
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో సింహా ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత లెజెండ్ అంటూ మరోసారి ఇండస్ట్రీపై దాడి చేసింది ఈ కాంబో. ఇది కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. వేరే హీరోలందరిని ఎలా చూపించినా కానీ, బాలయ్యకు ఇచ్చే ఎలివేషన్స్ లో బోయాకు పూనకం వస్తుందా అన్నట్టు ఉంటాయి ఆయన సీన్స్. ఈ సినిమా అప్పట్లో రికార్డు కలక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత వీరి కాంబో మళ్లీ రిపీట్ అయ్యింది. అదే అఖండతో. బాలయ్య పని అయిపోయింది.. ఇంకా సినిమాలు చేయడం వేస్ట్.. థియేటర్స్ కు వెళ్లడం కూడా వేస్ట్ అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అఖండ రిలీజ్ అయ్యింది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా థియేటర్ దద్దరిల్లిపోయి.. రికార్డు కలక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసే పడేసింది. బాలయ్య సత్తాను మరోసారి రుజువు చేసింది.
ఎక్కడ విన్నా.. చూసినా అఖండనే.. అసలు ఆ ట్రాన్స్ లో నుంచి అభిమానులు బయటకు రాలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి టేకింగ్ .. థమన్ మ్యూజిక్.. థియేటర్ లో సౌండ్ బాక్సులు పేలిపోయాయి. ఇక ఆ తరువాత బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా అందరూ కోరుకుంటున్న ఏకైక సినిమా అఖండ 2.
ఎప్పుడెప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య.. బాబీ డైరెక్షన్ లో NBK109 సినిమాతో బిజీగా ఉన్నాడు ఇంకోపక్క బోయపాటి స్కంద తో పరాజయాన్ని అందుకొని కసిమీద ఉన్నాడు. బాలయ్య ఆ సినిమాను ఎప్పుడు ఫినిష్ చేసి తన చేతికి దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఈలోపు బాలయ్యకు ధీటుగా ఉండే విలన్ కోసం వెతికే వేటలో పడ్డాడట బోయా.
ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు బాలీవుడ్ స్టార్లను దింపే ఆలోచనలో ఉన్నాడట. వారు సంజయ్ దత్, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్. ఇందులో అర్జున్ రాంపాల్.. ఆల్రెడీ భగవంత్ కేసరిలో నటించాడు.. బాబీ డియోల్ NBK109 లో నటిస్తున్నాడు. అందుకే ఈసారి సంజయ్ దత్ ను అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్.. డబుల్ ఇస్మార్ట్ తో బిజీగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా కనుక ఒప్పుకుంటే.. బాలయ్యకు మంచి విలన్ దొరికినట్టే. అయితే ఎలాంటి స్టార్ హీరో విలన్ గా ఉన్నా. .. బోయా చూపంతా బాలయ్య మీదనే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాను బాలయ్య బర్త్ డే రోజున అధికారికంగా వెల్లడి చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











